
ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 98 కోట్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కు రంగం సిద్ధం చేసింది. భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ. 65 కోట్ల గ్రాస్ సాధించి, ఈ ఏడాదిలోనే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ చరిత్రలో ఓజీ 4వ స్థానంలో నిలిచింది.
ప్రీమియర్ షోల కలెక్షన్లలో కూడా ఓజీ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇండియాలో ప్రీమియర్ షోల ద్వారా రూ. 23 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే, నైజాంలో ఏకంగా 366 ప్రీమియర్ షోలు వేయడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డు.
విదేశాల్లోనూ ఓజీ హవా తగ్గడం లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, 2025లో ఈ మార్కెట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.
మొత్తంగా, తొలి రోజునే ఓజీ రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయం పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి చాటి చెప్పింది. పవన్ కు 2025 సంవత్సరం అన్ని విధాలా కలిసొచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఓజీ సినిమా సాధిస్తున్న రికార్డులు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.