- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ” విడుదల కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఎంత అద్భుతంగా ఉందో టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రీమియర్స్‌కి టికెట్లు అమ్మకానికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా సేల్ అవ్వడం, అలాగే ఫస్ట్ డే షోలు దాదాపు అన్ని హౌస్‌ఫుల్ కావడం పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌కు నిదర్శనం. ప్రత్యేకంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం కేవలం ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కలిపి సుమారు రూ.25 కోట్ల షేర్ వసూళ్లు రావడం ఖాయమని చెబుతున్నారు. సాధారణంగా ఇంత భారీ ఫిగర్స్ ఓపెనింగ్ డే లో రాబట్టడం చాలా అరుదు.


కానీ పవన్ సినిమాకు ఉన్న క్రేజ్, ఫ్యాన్స్ చూపిస్తున్న డిమాండ్ చూస్తే ఇది సులభమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో తర్వాత రోజుల్లో వసూళ్లు మరింత ఊహించని స్థాయికి చేరతాయ‌ని లెక్క‌లు వేస్తున్నారు. గతంలో పవన్ నటించిన సినిమాలు మిక్స్ డ్‌ టాక్ వచ్చినా కలెక్షన్లు బలంగా కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది “ఓజీ”లాంటి యాక్షన్ థ్రిల్లర్, అలాగే సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కొత్త అవతారంలో కనిపించనున్నాడని ఇప్పటికే టీజర్స్, ట్రైలర్స్ ద్వారా ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ అయ్యింది.


అందువల్ల నైజాం ఏరియాలో రికార్డులు తిరగరాయడం ఖాయం. “ఓజీ” సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు తెలుగు సినీ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో, పవన్ కళ్యాణ్ క్రేజ్ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: