మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా మూవీ మాస్ జాతర.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ, శ్రీలీలతో పాటు చిత్ర యూనిట్ అందరూ పాల్గొని సందడి చేశారు.అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా కోలీవుడ్ నటుడు సూర్య వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో స్టేజిపై నా తమ్ముడు జీవితం అలా అవ్వడానికి కారణం రవితేజ నే అంటూ ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు సూర్య.మరి ఇంతకీ రవితేజ వల్ల కార్తీ జీవితం ఏమైంది.. ఎందుకు సూర్య అలా మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. రవితేజ మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోలీవుడ్ నటుడు సూర్య రవితేజని ఆకాశానికి ఎత్తేస్తూ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్యఈవెంట్ లో స్టేజ్ పై మాట్లాడుతూ.. రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి నేను చాలా పెద్ద అభిమానిని.ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా చెబుతున్నాను 

సినిమా పక్కా బ్లాక్ బస్టర్.. రవితేజ లాంటి హీరోలు కొంతమందే ఉంటారు. రజినీకాంత్,అమితాబ్ బచ్చన్ తర్వాత నెక్స్ట్ రవితేజనే.. ఆయన కామెడీ టైమింగ్, ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి.. రవితేజకు తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.తమిళ ప్రేక్షకులు ఈయన సినిమాల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రవితేజ చేసిన చాలా సినిమాలు నేను చూశాను. ఆయన నటించిన విక్రమార్కుడు మూవీ అంటే నాకు చాలా ఇష్టం.అయితే ఈ సినిమాని నా తమ్ముడు కార్తీ తమిళ్లో రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. కార్తీ జీవితాన్ని విక్రమార్కుడు సినిమా మార్చేసింది.

అలా రవితేజ నటించిన విక్రమార్కుడు కార్తీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్.. నా తమ్ముడి జీవితం మారిపోయింది అంటూ సూర్య స్టేజ్ పై ఎవరూ ఊహించని కామెంట్స్ చేశారు. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు మూవీ రవితేజ కెరీర్ నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ఇదే మూవీని తమిళ్లో కార్తీ రీమేక్ చేశారు. అక్కడ కూడా ప్రేక్షకులు విక్రమార్కుడు సినిమాని ఆదరించారు.అలా కార్తీకి తమిళ్లో గుర్తింపును తీసుకొచ్చిన సినిమా విక్రమార్కుడు. ఆ విధంగా సూర్య చెప్పుకొచ్చారు. అలాగే అక్టోబర్ 31న అందరూ సినిమా చూడాలని సినిమా పక్కా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను అంటూ సూర్య చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సూర్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: