ప్రభాస్ హీరోగా, తృప్తి హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి అభిమానుల్లో ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్నంటే ఉన్నాయి. తాజాగా ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ డ్రామా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమాలు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి స్పిరిట్ టీమ్‌తో కలిసి దిగిన ఫోటోలు నిమిషాల్లోనే ట్రెండ్ అయ్యాయి. ప్రభాస్–సందీప్–చిరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు మామూలు విషయం కాదు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ప్రశ్న బాగా వైరల్ అవుతోంది… “సందీప్ రెడ్డి వంగా ఎందుకు యంగ్ స్టార్ హీరోలను కాకుండా మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే పూజ కార్యక్రమాలకు ఆహ్వానించాడు?”


ఇక దీనిపై ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా తన కెరీర్ ప్రారంభ దశలనుంచే మెగాస్టార్ కి హార్డ్‌కోర్ ఫ్యాన్. చిరంజీవి ఎలా మాస్ ఎమోషన్స్ హ్యాండిల్ చేస్తారో, ఎలా స్క్రీన్‌పై ఎనర్జీ చూపిస్తారో సందీప్‌కు అపారమైన అభిమానం. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆయన ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు కూడా. ఇండస్ట్రీలో గుసగుసల ప్రకారం, సందీప్ రెడ్డి వంగా తన డైరెక్షన్ జర్నీ మొదలు పెట్టినప్పటి నుంచే ఒక కలను మనసులో పెట్టుకున్నాడట— “నేను డైరెక్ట్ చేసే ఒక పెద్ద సినిమాకు మొదటి క్లాప్ చిరంజీవిగానే వేయాలి” అని. ఈ కలను ఎంతో కాలం నుంచి మోస్తూనే వచ్చాడట. ఈసారి ‘స్పిరిట్’ లాంటి భారీ ప్రాజెక్ట్ వచ్చేసరికి సందీప్ ఆ డ్రీమ్‌ను నిజం చేసుకున్నాడు.



సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్, పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న అతిపెద్ద డైరెక్టర్లలో ఒకరు. అలాంటి వ్యక్తి అయినప్పటికీ, తన ఫ్యాన్ ఇజాని ఎక్కడా దాచి పెట్టడు. ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా—
ఎప్పటికైనా ఒకరోజు చిరంజీవితో ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని, అదొక జీవిత కోరిక అని .



ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ త్వరలోనే రియాలిటీ కావచ్చని కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వంగా హైపర్ బిజీ అయినప్పటికీ, మెగాస్టార్‌తో ఒక స్క్రిప్ట్ లాక్ చేసే పనులు బ్యాక్‌డోర్‌లో జరుగుతున్నాయనే ప్రచారం సైలెంట్‌గా నడుస్తోంది.
ఇదిలా ఉంటే, ‘స్పిరిట్’ పూజ కార్యక్రమాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, సందీప్, చిరు కలిసి కనిపించిన ప్రతి స్టిల్ అభిమానుల్లో కొత్త ఎక్సైట్మెంట్‌ని పెంచుతోంది. మెగాస్టార్ ఆశీర్వాదాలతో స్టార్ట్ అయినందున ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ ఆతృతగా ఎదురుచూసిన కల నిజమైందని, అందుకే ఆయన ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించారని ఇండస్ట్రీలో చర్చ బలంగా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: