ఏపీ రాజకీయాలలో అత్యధిక నియోజకవర్గాలు కలిగిన జిల్లాల్లో అతి పెద్ద జిల్లా గుంటూరు. ఈ జిల్లాలో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం నాయకులు ఎప్పుడూ చక్రం తిప్పుతూ ఉంటారు. ప్రజలు కూడా వారి ఆలోచనల మేరకే వ్యవహరిస్తుంటారు. అటువంటిది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, ఈ జిల్లా నుండి తన మంత్రివర్గంలో ఇద్దరికీ స్థానం కల్పించారు. ఒకటి మోపిదేవి వెంకటరమణ కి మరొకటి మేకతోటి సుచరిత కి మంత్రి పదవులను ఇవ్వటం జరిగింది.

IHG

ఇద్దరు కీలక నేతలు కలిగిన ఈ జిల్లా కి, పక్క జిల్లా నాయకులు మరియు జగన్ కి అత్యంత రాజకీయ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ని ఇన్చార్జిలుగా నియమించడంతో.. గుంటూరు వైకాపాలో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని విషయాల్లో ఇన్చార్జిలు దగ్గర ఉండి జోక్యం చేసుకోవడంతో  స్థానిక ప్రజాప్రతినిధులకు మరియు ఇన్చార్జి లకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నట్లు పార్టీలో టాక్ వినపడుతోంది. దీంతో ప్రజలు కూడా స్థానికంగా తాము ఎన్నుకున్న నాయకుల పై విమర్శలు చేస్తున్నారట.

IHG

స్థానిక ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ సమస్యలు ఎక్కడ ఎలాంటివి ఉన్నాయో తెలుస్తాయి. ఎక్కడి నుంచో జిల్లా స్థితిగతులు తెలియనివారు ఇక్కడ ఇన్చార్జిలుగా ఉంటే వారికి మా సమస్యలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నిస్తున్నారు అట. దీంతో వైయస్ జగన్ నియమించిన ఇన్చార్జిల వ్యవహారం గుంటూరు వైకాపాలో టెన్షన్ వాతావరణం పుట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ… రాజ్యసభకు వెళ్లడంతో ఇప్పుడు వారి ప్లేసులో ఎవరిని తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: