సీఎం కేసీఆర్ ఒక్క‌సారి ఎవ‌రిపైనైనా గురిపెడితే వారి అంతుచూసే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌ర‌న్న అప‌వాదు ఉంది. ఇప్పుడు ఈట‌ల వ్య‌వ‌హారంలో చూస్తుంటే అది నిజ‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. అసైన్డ్ భూముల‌ను క‌బ్జాచేశాడంటూ ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ కేసీఆర్‌.. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న్ను ఒంట‌రిని చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాడు. మంత్రి గుంగుల‌తో పాటు మ‌రో మంత్రి హ‌రీష్‌రావునుసైతం రంగంలోకి దింపాడు కేసీఆర్‌. ఫ‌లితంగా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఈట‌ల వ‌ర్గీయులు ఒక్కొక్క‌రిగా సీఎం కేసీఆర్ నిర్ణ‌య‌మే త‌మ నిర్ణ‌య‌మంటూ చెప్పేస్తున్నారు. ఫ‌లితంగా అనుచ‌రుల‌ను న‌మ్ముకొని కేసీఆర్‌పై కాలుదువ్విన ఈట‌ల ప‌రిస్థితి అయోమ‌యంగా మారుతుంది.

ఈటల రాజేంద‌ర్‌పై వ‌చ్చిన భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌ను ప‌లు కోణాల్లో విచార‌ణ‌కు ఆదేశించిన కేసీఆర్‌.. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటూ ఈట‌ల‌ను క‌ట‌క‌టాల్లోకి నెట్టేందుకు మార్గం సుగుమం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అసైన్డ్ భూములు క‌బ్జాలు నిజ‌మేన‌ని క‌మిటీ తేల్చింది. అయితే హైకోర్టులో ఈట‌ల రాజేంద‌ర్‌కు కొంత ఊర‌ట ల‌భించింది. కేసీఆర్ మాత్రం త‌న‌దైన వ్యూహాల‌తో ముందుకెళ్తూ ఈట‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా ఈట‌ల రాజేంద‌ర్ కుమారుడు నితిన్ రెడ్డిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో త‌క్ష‌ణ‌మే ద‌ర్యాప్తు ప్రారంభించాల‌ని సీఎస్ సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.

మేడ్చ‌ల్ జిల్లా మేడ్చ‌ల్ మండ‌లం రావ‌ల్ కోల్ గ్రామనివాసి పీట్ల మ‌హేష్ ముదిరాజ్ అనే వ్య‌క్తి ఈట‌ల రాజేంద‌ర్ కుమారుడు నితిన్‌రెడ్డి త‌న భూమిని క‌బ్జాచేశాడంటూ సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. త‌న భూమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు త‌మ‌ను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నార‌ని మ‌హేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన కేసీఆర్‌.. వెంట‌నే ద‌ర్యాప్తు జ‌రిపి ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని రెవెన్యూ, అవినీతి నిరోద‌క‌శాఖ‌, విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే కేసీఆర్ వ్యూహాల‌తో ఉక్కిరిబిక్కిర‌వుతున్న ఈట‌ల‌కు ప్ర‌స్తుత వ్య‌వ‌హారం మ‌రింత త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతుంద‌న‌టంలో అతిశ‌యోక్తిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: