ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా కొత్త ప్రాజెక్టులకు, పెట్టుబడులకు కేంద్రం ఉత్సాహం చూపిస్తుంది. ఇటీవలే కాశీ క్షేత్రంలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా మొదటి విడతను దేశానికి ప్రధాని అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అక్కడ రెండు రోజులు ఉండి మరి ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే నేడు ఆయన గంగా ఎక్స్ ప్రెస్ వే కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఇతర బీజేపీ జాతీయ నేతలు కూడా హాజరవుతున్నారు. ఈ వే ద్వారా భక్తులు త్వరగా కాశీనాధుని చేరుకునే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.

ఈ మధ్యాహ్నం 12.50కి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అనంతరం ప్రధాని మోడీ స్థానిక రోసా రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని షాజహాన్ పూర్, హర్దోయ్, బదౌన్, లఖీమ్ పూర్ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలతో మాట్లాడనున్నారు. వే ను ప్రారంభించడానికి వస్తున్న మోడీని స్వాగతించడానికి రాష్ట్ర గవర్నర్, సీఎం యోగీ ఆదిత్యనాధ్ రానున్నారు. మీరట్ నుండి ప్రయాగ్ వరకు 594కిమీ ఉన్న గంగా ఎక్స్ ప్రెస్ వే పనులు 2024 నాటికీ పూర్తి చేయాలని ప్రణాళికలు వేశారు. ఈ ఎక్స్ ప్రెస్ వే మీరట్ లోని బిజౌలి గ్రామం నుండి ప్రారంభం అయ్యి, ప్రయాగ్ లోని జుడాపూర్ దండు గ్రామాన్ని చేరుతుంది, అంటే దాదాపుగా 12 జిల్లాలలోని 30 ప్రాంతాలను కలుపుతుంది.

ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 36230కోట్లుగా నిర్ణయించారు. దీనిని ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో పూర్తి చేయనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆధారిటీ భూమి సంబంధిత ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉంది. షాజహాన్ పూర్ లో ప్రధాని గా మోడీ పర్యటన ఇది రెండోసారి. మొదటి సారి 2018లో రైతు సంక్షేమ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారు. నేడు మోడీ బరేలీలోని త్రిశూల్ ఎయిర్ బేస్ కు 12.10 కి చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్ లో బహిరంగ సభకు చేరుకోనున్నారు. 12.50కి రోసా రైల్వే గ్రౌండ్స్ కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో సీఎం ఆదిత్యనాధ్ సహా పలువురు బీజేపీ మంత్రులు కూడా పాల్గొననున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: