
పెరుగుతున్నవి :
- పత్తి ఉత్పత్తి ధరలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- వంట నూనెల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతు ఉండగా ఇప్పుడు మరింత పెరిగ పోతున్నాయి.
- మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, వాషింగ్ మిషన్ ల ధరలు కూడా మరింత పెరగబోతున్నాయి.
- ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతూ ఉండగా.. ఇక ఇప్పుడు యూనియన్ బడ్జెట్ ప్రకారం రానున్న రోజుల్లో ఎరువుల ధరలు పెరిగి రైతుల పై మరింత భారం ఎక్కువ కానుంది.
- విదేశీ మద్యం ధరలు కూడా పెరుగుతాయి.
- బటాని, కాబూలీ శనగలు ధరలు పెరగనున్నాయి.
- ఇక ఇప్పుడు సామాన్యుల అందరికీ కూడా భారంగా మారిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు అంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం గమనార్హం.
ఏవి తగ్గిపోతున్నాయి అంటే :
- మొబైల్ ఛార్జింగ్ ధరలు తగ్గిపోతున్నాయి.
- బెల్ట్, పర్స్ లాంటి లెదర్ ఉత్పత్తులు షూస్ లాంటివి తగ్గిపోనున్నాయి.
- సోలార్ లాంతర్లు ధరలు కూడా తగ్గనున్నాయి.
- స్టీల్ ధరలు సామాన్యులకు ప్రియం కాబోతున్నాయి.
- కస్టమ్స్ డ్యూటీ తగ్గిన నేపథ్యం లో బంగారం వెండి ధరలు రానున్న రోజుల్లో తగ్గిపోతున్నట్లు తెలుస్తుంది.
- నైలాన్ దుస్తుల ధరలు కూడా తగ్గి పోనున్నాయ్.