యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. తారక్, హృతిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్2 సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 120 కోట్ల రూపాయలకు అమ్ముడవగా వార్2 సినిమాకు సైతం అదే స్థాయిలో డిమాండ్ నెలకొనడం గమనార్హం.
 
సితార నాగవంశీ, ఆసియన్ సునీల్ లలో ఎవరో ఒకరు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వార్2 రైట్స్ కోసం ఇంత డిమాండ్ ఉందని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్క్రీన్ స్పేస్ ఒకింత తక్కువగానే ఉందనే సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
 
వార్2 సినిమా ప్రమోషన్స్ అధికారికంగా ఇంకా మొదలుకాలేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా క్రేజీ అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. బరువు పెరగడం తగ్గడం వల్ల తారక్ లుక్స్ విషయంలో సైతం కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో తారక్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
 
వా2 సినిమాలో తారక్ కు జోడీగా కనిపించే బ్యూటీ ఎవరనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది. వేగంగా సినిమాల్లో నటిస్తే తారక్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటున్న తారక్ వార్2 సినిమాతో వరుసగా ఎనిమిదో హిట్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది. గత పదేళ్లలో తారక్ నటించిన ప్రతి సినిమా సక్సెస్ సాధించిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: