టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాలలో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈ హీరో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో సినిమాలలో కీలకపాత్రలలో నటించి సక్సెస్ఫుల్ గా తన కెరీర్ కొనసాగించారు. ఆ తర్వాత నువ్విలా సినిమాతో హీరోగా అవకాశాన్ని అందుకున్నాడు. 

మొదటి సినిమాతోనే హీరోగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఈ హీరోసినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో హీరోగా నటించి సక్సెస్ఫుల్ గా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ మధ్యకాలంలో ఈ హీరో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే 30వ తేదీన రిలీజ్ కానుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసింది.

ఇక ఈ సినిమాలో హీరో విజయ్, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నట్టుగా ఈ సినిమాలో విడుదలైన పాటలో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా....ప్రస్తుతం హీరో విజయ్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. హీరో విజయ్ దేవరకొండ ఇదివరకే నటి రష్మికతో రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మీరు బహిరంగంగా వెల్లడించినప్పటికీ సీక్రెట్ గా వీరి ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నట్లుగా ఓ రూమర్ తేగ వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: