- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఓ చాట్ షోలో తాను శింబు న‌టించిన “పత్తు తల” సినిమా నుంచి “నీ సింహం దాన్” పాటను చాలా ఇష్టపడతానని చెప్పారు. ఆర్సీబీ పోస్టులో కోహ్లీని ట్యాగ్ చేయ‌డంతో శింబు కూడా స్పందించి “ నీ సింహం దాన్ ” అంటే “ నువ్వు నిజమైన సింహం ” అని వ్యాఖ్యానించారు. STR మరియు విరాట్ అభిమానులు ఈ అరుదైన కలయికను తెరపై కాదు గానీ తెర బ‌య‌ట కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇక్క‌డి తో అయిపోలేదు.. ఈ ఇద్ద‌రు త‌మ స్పెష‌ల్ బియ‌ర్డ్ స్టైల్లో ఆక‌ట్టుకుంటున్నారు. శింబు తన ఫిట్‌నెస్‌ను పెంచుకోవడంతో, అతని లుక్ కొంతవరకు విరాట్ కోహ్లీని తలపిస్తోంద‌న్న కామెంట్లు సోష‌ల్ మీడియా లో ప‌డుతున్నాయి. ఇప్పుడు సోష‌ల్ మీడియా లో చాలా మంది సినీ ల‌వ‌ర్స్ శింబు కొత్త లుక్ షేర్ చేస్తూ కోహ్లీ ఫొటో ప‌క్క‌నే పెట్టి మ‌రీ కామెంట్లు చేస్తున్నారు.


దీంతో విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అతడి పాత్ర పోషించబోతున్నాడా ? అని ముంబయి వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇక వీరి మ‌ధ్య సోష‌ల్ మీడియా కామెంట్ల ప్ర‌కారం విరాట్ కోహ్లీ - అనుష్క శ‌ర్మ ఇద్ద‌రూ క‌నుక ఓకే అంటే ఈ శింబు ఈ బ‌యోపిక్ కు హీరోగా ఎంపిక‌య్యే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. అటు క్రికెట‌ర్‌ విరాట్ ఐపీఎల్‌లో విజృంభిస్తుండగా, మరోవైపు STR “థగ్ లైఫ్”, “STR49”, “STR50”, “STR51” సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. దీనికి విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా చేరితే, ఇది పాన్ ఇండియా రేంజ్ లో ఖ‌చ్చితంగా ఓ సంచ‌ల‌నం అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: