ఏపీలో ప్రస్తుతం అందరూ తాజాగా చంద్రబాబు నిర్వహించిన కందుకూరు మరియు గుంటూరు సభలలో అన్యాయంగా తొక్కిసలాట కారణంగా చనిపోయిన ఘటన గురించి చర్చ జరుగుతోంది. వైసీపీ వాళ్ళు చంద్రబాబు సభ వలనే ఈ ఘోరం జరిగింది అంటూ నిందిస్తూ విమర్శలు చేస్తుంటే ... అందుకు పూర్తి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు మాట్లాడుతుండడం విశేషం. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ కందుకూరులో జరిగిన ఘటన గురించి అందరికీ మనసులో బాధ ఉంది. కానీ వైసీపీ వాళ్ళు అంటున్న విధంగా చంద్రబాబు లేదా టీడీపీ ఈ ఘోరానికి కారణం కాదు అని గుర్తించాలని అన్నారు.

కేవలం తొక్కిసలాట కారణంగానే ఈ బాధాకర విషాదం జరిగింది అని చెప్పుకొచ్చారు. బోండా ఉమా మాట్లాడుతూ  వైసీపీ విమర్శలు ఇప్పుడేమీ కొత్త కాదని... ఓటమికి ముందు జగన్ అండ్ కో భయపడుతున్నారని అన్నాడు. చంద్రబాబు సభకు ప్రజలు లక్షల్లో రావడం చూసి ఓర్వలేకే దొరికిన అవకాశాన్ని వాడుకుని విమర్శలు చేస్తున్నారు అంటూ వైసీపీపై మండిపడ్డారు. తాజాగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 కూడా ఎంతదారుణంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బ్రిటీష్ పాలన కాలంలో లాగా విచిత్రమైన జీవో లను తీసుకువస్తున్నదంటూ ఫైర్ అయ్యాడు.

సభలు ఎక్కడ పెట్టుకోవాలి ? ఎలా పెట్టుకోవాలి ? అన్న విషయంపై కూడా ప్రభుత్వం ప్రతిపక్షాలకు సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని బోండా ఘాటుగా స్పందించారు. సొంత పార్టీలోనే జగన్ కు విలువలేదు , అందరూ ఫెయిల్యూర్ సీఎం అంటూ చెప్పుకుంటున్నారు, రానున్న రోజుల్లో ఒక నియంతలా ఈ రాష్ట్ర ప్రజలు చూడనున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దమ్ముంటే కందుకూరు ఘటనకు కారణమైన పోలీసుల నిర్లక్ష్యం మీద సిబిఐ విచారణ జరిపించాలని ఛాలెంజ్ చేశారు. మరి ముందు ముందు ఏపీలో ఈ రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయి అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: