
ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతూ అటు ఆ రెండు పార్టీ నాయకులు కార్యకర్తలకు మరియు జనసేనను నమ్ముతున్న ప్రజలకు కన్ఫ్యూజన్ కలిగిస్తున్నాడు. ఒకసారి టీడీపీతో కలిసి పోటీ చేస్తాను అంటాడు... మరోసారి పొత్తుల గురించి ఇప్పుడు ఆలోచించే అంత అవసరం ఏముంది, ఎన్నికలకు ముందు మా నిర్ణయాన్ని ప్రజలకు తెలియచేస్తామంటూ చెబుతాడు. దీనితో జనసేన కార్యకర్తలు కావొచ్చు లేదా తనను అభిమానిస్తున్న ప్రజలు కావొచ్చు డైలమాలో పడుతున్నారు. అస్సలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అర్ధమవుతున్నాయా లేదా? ఎందుకు తీసుకున్న నిర్ణయం మీద నిలబడడం లేదు అంటూ విమర్శిస్తున్నారు.
తాజాగా ఈ పొత్తులపైన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఏపీలో ఉన్న అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా అవినీతి కుటుంబ పార్టీలని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలను అధికారంలోకి రానివ్వమని.. జనసేన బీజేపీ లు కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఇక పవన్ ఎందుకు టీడీపీతో పొత్తు అంటున్నాడని అడుగగా... దీనికి మాత్రం సోము వీర్రాజు పవన్ నే ఈ విషయం అడిగి తెలుసుకోండంతో దాటవేశారు. మరి ఇన్ని సందేహాల నడుమ 2024 ఎన్నికలు ఎలా జరగనున్నాయి చూడాలి.