ప్రస్తుతం దేశంలో ఉన్న యువ ఎంపీ  లలో ఒకరు తేజస్వి సూర్య. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ బెంగళూరు నుంచి ఎంపీగా ఎన్నికైన తేజస్వి సూర్య ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటే ... కొన్నిసార్లు ప్రతిపక్షాల విమర్శలతో  వార్తల్లో నిలుస్తూ  ఉంటారు. సోషల్ మీడియాలో యువ ఎంపీ తేజస్వి సూర్య గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోనే ఉంటారు . ఇక తాజాగా ఈ 29 ఏళ్ల ఎంపీ గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. 

 

 

 ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తేజస్వి సూర్య తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు . మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఆయన ఉదయం కొండచరియల్లో  చేసిన యోగ. ఈరోజు ఉదయం అశ్విని  సూర్య తన సోషల్ మీడియా ఖాతాలో నాలుగు ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో  ఆయన  కొండ ప్రాంతంలో పెద్ద బండరాయి మీద యోగ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి . 

 

 

 అందరికీ గుడ్ మార్నింగ్ అంటూ ఎంపీ తేజస్వి సూర్య పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ పోస్ట్ పై పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎంత అందమైన ప్రదేశం ఉన్న చోట  ఇంకా జిమ్ అవసరం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.  మరి కొంతమంది అయితే...పలు  ప్రాంతాలలో తాము యోగా చేస్తున్న ఫోటోలను ఈ ఫోటోలకు  ఒక కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు మేము కూడా రోజును  ఇలాగే ప్రారంభిస్తాం... ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాముం  అంటూ కొందరు  కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ ఎంపీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు .

మరింత సమాచారం తెలుసుకోండి: