మహిళలపై అత్యాచారం, బ్లూఫిలిం తీయడం.. బెదిరించడం వంటి.. ఆరోపణలు తెలంగాణలో ఓ రాజకీయ నాయకుడి పొలిటికల్ కేరీర్ ను క్లోజ్ చేశాయనిపిస్తోంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో పని చేసే టీఆర్ఎస్ లో పని చేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న రఘునందన్‌ రావు.. ఇటీవల సెక్స్, రేప్ ఆరోపణల్లో ఇరుక్కున సంగతి తెలిసిందే.

 

 

కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ రావు భయపెట్టి లొంగదీసుకుంటాడని రాధారమణి అనే మహిళ ఆరోపించారు. ఆ తర్వాత మహిళలను బెదిరించి వారితో బ్లూ ఫిలింగ్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తాడని ఆమె చెప్పారు. అంతే కాదు.. హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేది కూడా రఘునందన్ రావేనని ఆమె ఆరోపించారు.

 

రఘునందన్ రావే దగ్గరుండి పరిచయం చేయించి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుకు సప్లై చేయించేవాడని రాధ ఆరోపించారు. ఈ ఆరోపణలు కలకలం రేపాయి. రఘునందర్ రావు విషయం బీజేపీ పరువు పోగొట్టేలా ఉందని పార్టీ భావించింది. దీంతో బీజేపీ అధికార ప్రతినిది రఘునందనరావు కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నారు.

 

 

తనపై వచ్చిన ఆరోపణలకు గాను నైతిక బాద్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కు రాసిన ఒక లేఖలో తెలిపారు. ఈ కేసులో కోర్టు నుంచి రిలీఫ్ వచ్చే వరకు రాజకీయ వ్యవహారాలలో ఉండనని ఆయన తెలిపారు. అయితే ఇది రఘునంద్ రావు తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తున్నా.. పార్టీ ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: