తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం ముదురుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జోరుగా వరద వస్తోంది. ప్రాజెక్టు నిండింది. కిందకు నీళ్లు వదులుతున్నారు. కొన్ని రోజుల్లో సాగర్ జలాశయం కూడా నిండటం ఖాయం. విద్యుదుత్పత్తి కారణంగా విడుదల చేస్తున్న నీరు ఏకంగా సముద్రం పాలవుతోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ సర్కారు పోతిరెడ్డి పాడుకు ఏపీ నీళ్లు వదలకుండా చూడాలని కృష్ణాబోర్డుకు లేఖ రాయడంపై ఏపీ నేతలు మండిపడుతున్నారు.


కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ఈఎన్సీ శాడిజంతో వ్యవహరించటం తగదంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. నీళ్లు సముద్రంలోకి కలిసినా పర్లేదుగానీ పోతిరెడ్డిపాడుకు ఇవ్వొద్దని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు చెప్పటం దుర్మార్గమంటున్నారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, చెన్నైకి తాగునీరు ఇవ్వడం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే సాధ్యమని.. భేషజాలు లేవన్న జగన్, కేసీఆర్‌ లు ఇప్పుడు నదీజలాల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శిస్తున్నారు.


ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన కృష్ణా జలాల అంశాన్ని కేంద్రానికి అప్పగించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు పొర్లిపోతున్నా కృష్ణా జలాలను సముద్రం పాల్జేస్తాం కానీ రాయలసీమకు మాత్రం పోనివ్వమని తెలంగాణ అంటుంటే ఏపీ సీఎం ఎందుకు నోరెత్తరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.


పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించడానికి వీల్లేదని కేఆర్ఎంబీకి తెలంగాణ ఇంజనీరింగ్ అధికారి లేఖ రాస్తే... కేసీఆర్‌తో నిన్నటి వరకు రాసుకుపూసుకు తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఆ లేఖపై ఎందుకు స్పందించరని నిలదీశారు. ఏపీలో క్రిష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ కు మాత్రం నీరు తరలించకూడదంటున్న తెలంగాణ... గోదావరి బేసిన్ నుంచి క్రిష్ణా బేసిక్ ను తరలించుకు పోతోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తే, వారు కడుతున్న దిండి ఎత్తిపోతలపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: