అయితే.. ఇలా చర్చలకు వెళ్లకుండా మొండికేయడం వల్ల సమస్య ఇంకా జటిలం అవుతుంది. అందుకే ఉద్యోగ సంఘాల నేతలు కాస్త మెత్తబడ్డారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఓ ప్రతిపాదన పంపారు. ఇకపై ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక ఆహ్వానం ఉంటేనే చర్చలకు వెళ్తామని షరతు విధిస్తున్నారు. చర్చల కంటే ముందు మూడు ప్రధాన డిమాండ్లను నెరవేరిస్తేనే చర్చలకు వెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఇంతకీ ఈ మూడు డిమాండ్లు ఏంటో తెలుసా.. ఇప్పటికే కొత్త పీఆర్సీని అమలు చేసేలా జారీ చేసిన జీవోలను రద్దు చేయాలనేది మొదటి డిమాండ్.. ఆ తర్వాత పాత నెల జీతమే ఈ నెలకు కూడా ఇప్పించాలనేది రెండో షరతు. మూడోది అశుతోష్ కమిటీ నివేదికను బయటపెట్టాలన్నది మూడో డిమాండ్.. ఈ మూడు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే.. తక్షణమే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
మరి ఈ షరతులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే విడుదల చేసిన ప్రభుత్వ జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని ప్రభుత్వం చెబుతోంది. ఆ విషయంపై ప్రభుత్వం గట్టిగా ఉంటే.. చర్చలు మొదలయ్యే అవకాశాలు తక్కువే. అశుతోష్ కమిటీ నివేదిక విషయంలో మాత్రం ప్రభుత్వం మొదటి నుంచి గోప్యంగానే ఉంచుతోంది. మరి ఇకనైనా చర్చలు త్వరలోనే ప్రారంభం అవుతాయా.. ఈ పీఆర్సీ గొడవ వ్యవహారం సెటిల్ అవుతుందా.. ఏమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి