అవును.. రాజ‌కీయాల్లో ఇదే చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ నిజం.. ర‌ఘురామ అబ‌ద్ధం.. అనే విష‌యాన్ని స్ఫ‌ష్టంగా ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిన దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల పాటు న‌ర‌సాపురం ఎంపీ, వైసీపీ రెబ‌ల్ నాయ‌కుడు ర‌ఘురామ కృష్ణ‌రాజు.. సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. ఆయ‌న‌ను తీవ్ర‌స్థాయిలో వ్య‌క్తిగ‌తంగా కూడా దూషించారు. ప్ర‌తి రోజూ ర‌చ్చ‌బండ పేరుతో డిల్లీ నుంచే ఆయ‌న త‌న వాయిస్ వినిపించారు.

ఇక‌, జ‌గ‌న్‌పై జ‌రుగుతున్న సీబీఐ కేసుల విచార‌ణ కూడా ముందుకు సాగ‌డం లేద‌ని పేర్కొన్నారు. దీనికి సంబంధించి.. ఆయ‌న కోర్టును కూడా ఆశ్ర‌యించారు. దీనిపై కేసులు న‌డుస్తున్నాయి. కొన్నింటిలో సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా తీర్పులు వ‌చ్చాయి. ఇదేస‌మ‌యంలో కొన్ని కేసుల్లో ర‌ఘురామ‌ను కోర్టులు నిల‌దీసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ కేసుల ద్వారా ర‌ఘురామ సాధించింది ఏమీ క‌నిపించ‌లేదు. ఇక‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై దుమ్మెత్తి పోశారు.

ఉచిత ప‌థ‌కాలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను సోమ‌రుల‌ను చేస్తున్నార‌ని కూడా వ్యాఖ్యానించారు. వీటిపై పెద్ద ఎత్తున టీవీ డిబేట్ల‌లోనూ చ‌ర్చించారు. ఆయా ప‌థ‌కాల ద్వారా వైసీపీ నేత‌లు దోచుకున్నార‌ని చెప్పారు. రాజ‌కీ యంగా జ‌గ‌న్‌ను, వైసీపీని ఎంత బ‌ద్నాం చేయాలో అంతా చేశారు క‌ట్ చేస్తే.. ఇప్పుడు ర‌ఘురామ‌ను ఏ పార్టీ కూడా చేర‌దీయ‌లేదు. టికెట్ మాట అటుంచితే.. అస‌లు పార్టీలు కూడా ఆయ‌న‌ను చేర్చుకునేందు కు సిద్ధంగా లేవ‌ని తాజా స‌మాచారం.

దీని వెనుక ఎవ‌రున్నారు?  ఏం జ‌రిగింది? అనేది ప‌క్క‌న పెడితే.. ఇప్ప‌టి వ‌ర‌కు రఘురామ రాజు సీఎం జ‌గ‌న్‌పై చేసిన ఆరోప‌ణలు, విమ‌ర్శ‌లు వంటివి తేలిపోయాయి. ఆయ‌న చెప్పింది నిజ‌మైతే.. అవి త‌మ‌కు మేలు చేస్తాయ‌ని భావించి ఉంటే.. ముఖ్యంగా వైసీపీని ఎదిరించిన బ‌లంగా నిల‌బ‌డిన నాయ‌కుడి వ‌ల్ల త‌మకు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అనుకుని ఉంటే.. ఇత‌ర పార్టీల్లో ఆయ‌న‌కు స‌భ్య‌త్వం అయినా. ద‌క్కి ఉండేది. కానీ, ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో.. కానీ, ప్ర‌స్తుతం ర‌ఘురామ అయితే.. ప్ర‌త్య‌క్షంగా గెలవ‌లేక పోయారు.

దీనిని బ‌ట్టి ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నాలు అబ‌ద్ధ‌మ‌నే అనుకోవాలి. లేదా.. ఆయ‌న చెప్పినివి పార్టీల‌కు రుచించ‌క పోయి అయినా అయి ఉండాలి. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ నిజం.. అయ్యారు, ర‌ఘురామ అబ‌ద్ధ‌మ‌య్యారు అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: