విడ‌ద‌ల ర‌జ‌నీ ఊర‌స‌ర‌వెల్లిని మించిన రాజ‌కీయాలు చేస్తూ ఉంటార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా పేరుంది. ఆమె చంద్ర‌బాబును పొగిడినా.. ఆకాశానికి ఎత్తేసినా.. జ‌గ‌న్‌ను న‌ర‌రూప రాక్ష‌సుడు అన్నా.. ఆ వెంట‌నే పార్టీ మార్చేసి చంద్ర‌బాబును తిట్టి.. అదే జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసినా ఆమెకే చెల్లింది. ఆమె ఊస‌ర‌వెల్లి రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయో గ‌త ఏడెనిమిదేళ్ల నుంచి ఆమె మాట్లాడిన ప్ర‌సంగాలు, యూట్యూబ్ వీడియోలే సాక్ష్యంగా నిలుస్తాయి.

ఇదంతా గ‌తం 2019లో ఆమె వైసీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ క‌ష్టాన్ని లాగేసుకుని.. ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ కండువా క‌ప్పుకుని జ‌గ‌న్ వేవ్‌లో ఎమ్మెల్యే అయ్యారు. మ‌ర్రి ప‌దేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌డిన క‌ష్టం.. పార్టీని బ‌తికించి పునాదులు వేయ‌డం ఇవ‌న్నీ ర‌జ‌నీ గెలుపులో కీల‌కం. ఆ త‌ర్వాత గెలిచిన వెంట‌నే మ‌ర్రిని రాజ‌కీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో.. అన్ని ఇబ్బందులు ర‌జ‌నీ పెట్టింద‌నే అంటారు.

త‌ర్వాత మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. పైగా ఫ‌స్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ఈ ఛాన్స్ యూజ్ చేసుకుంటే చిల‌క‌లూరిపేట‌ను కావాల్సిన‌ట్టుగా అభివృద్ధి చేసుకుని త‌న పేరును చిర‌స్థాయిగా నిలుపుకునే గోల్డెన్ ఛాన్స్ వ‌చ్చింది. కానీ కావాల్సినంత వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకోవ‌డంతోనే జ‌గ‌న్ ఆమెను ఏకంగా జిల్లా మార్చేసి గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ సీటుకు పంపేశారు. ర‌జ‌నీ గ‌త ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి చాలా ఫ్యాక్ట‌ర్స్ ప‌నిచేసినా ఆమె బీసీ మ‌హిళ కావ‌డం.. అటు ఆమె భ‌ర్త కాపు కావ‌డంతో రెండు వైపులా మ‌నం మ‌నం బ‌రంపురం అని ప్ర‌చారం చేసుకుని బాగా ల‌బ్ధిపొందారు.

ఇప్పుడు అదే మిక్స్‌డ్ క్యాస్ట్ ఈక్వేష‌న్‌తో ఈ సారి ఆమె గుంటూరు వెస్ట్‌లో ఓడిపోవ‌డం ప‌క్క‌గా క‌నిపిస్తోంది.  చిల‌క‌లూరిపేట‌లో పోటీ చేసిన‌ప్పుడు బీసీ అని ఓసారి, మీ కాపు కోడ‌లిని అని చెప్పుకుంటూ ఆమె ఆ ఈక్వేష‌న్లో బాగా ల‌బ్ధిపొందింది. ఇప్పుడు సీన్ మారింది. గుంటూరు వెస్ట్‌లో ఇదే ఈక్వేష‌న్ ఆమెను ఓడించ‌బోతోంది. ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న పిడుగురాళ్ల మాధ‌వి బీసీల్లో బాగా వెన‌క‌ప‌డిన ర‌జ‌క కులానికి చెందిన మ‌హిళ కావడంతో అన్నీ బీసీ కులాలు ఆమెకు వ‌న్‌సైడ్‌గా స‌పోర్ట్ చేస్తున్నాయి.

ఇటు ఆమె భ‌ర్త క‌మ్మ సామాజిక వ‌ర్గం కావ‌డంతో వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ సంఖ్య‌లో ఉండ‌డంతో పాటు రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉన్న వారంతా ఆమెకే స‌పోర్ట్ చేస్తున్నారు. పైగా కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచిన డివిజ‌న్ల‌లో ఒక‌టి మిన‌హా అన్ని డివిజ‌న్లు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నాయి. పైగా ఇది టీడీపీ సిట్టింగ్ సీటు. ఇక జ‌న‌సేన ప్ర‌భావంతో కాపు వ‌ర్గం అంతా టీడీపీ అభ్య‌ర్థికి వ‌న్‌సైడ్‌గా స‌పోర్ట్ చేస్తోంది.

ఇటు వైశ్య సామాజిక వ‌ర్గం  ఓట‌ర్లు కూడా ఎక్కువే ఉన్నారు. వీరికి టీడీపీ ఎప్పుడూ గుర్తింపు ఇచ్చింది. పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ మ‌ద్దాలి గిరిది ఇదే సామాజిక వ‌ర్గం కాగా.. ఆయ‌న‌కు టీడీపీ ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. వీరంతా టీడీపీకి ఎప్పుడూ విధేయులుగా ఉంటున్నారు. దీనికి తోడు మాధ‌వి బీసీల్లో వెన‌క‌ప‌డ్డ ర‌జ‌క త‌ర‌గ‌తుల‌కు చెందిన వారు కావ‌డం.. ఆమె కుటుంబం గ‌త కొన్నేళ్లుగా రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌తో పాటు అంద‌రిలోకి చొచ్చుకుపోయే మ‌న‌స్త‌త్వం.. ఇవ‌న్నీ ఎస్సీ, ఎస్టీల్లోనూ ఆమె ప‌ట్ల చాలా సానుకూల ధృక్ప‌థం ఉండేలా చేశాయి. ఇలా ఎలా చూసినా ప్ర‌తి కులం, ప్ర‌తి వ‌ర్గంలోనూ ర‌జ‌నీ కంటే మాధ‌వికే ప్ల‌స్‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ర‌జ‌నీ గెల‌వ‌డానికి కార‌ణ‌మైన ఈక్వేష‌న్‌తోనే ఈ సారి ఆమె ఓడి.. వెస్ట్‌లో మాధ‌వి గెల‌వ‌డం ఖ‌రారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: