టీడీపీ మ‌హేష్‌బాబు ఇప్పుడు కూట‌మిలో ఈ పేరు బాగా పాపుల‌ర్ అవుతోంది. ఈ మ‌హేష్‌ ఎవ‌రో ?  కాదు... టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు అల్లుడు. అటు మ‌హేష్ తండ్రి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు టీటీడీ చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు. ఈ సారి మ‌హేష్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని మూడేళ్ల నుంచే ప్లాన్‌తో ఉన్నారు. ముందుగా న‌ర‌సారావుపేట పార్లమెంటు సీటుపై కాన్‌సంట్రేష‌న్ చేస్తూ వ‌చ్చారు. అక్క‌డ టీడీపీలో స‌మీక‌ర‌ణ‌లు మార‌డంతో మ‌హేష్‌ను చంద్ర‌బాబు ఏలూరు పార్ల‌మెంటు నుంచి రేసులో ఉంచారు.

వాస్త‌వంగా అటు వైసీపీ కూడా ఏలూరు పార్ల‌మెంటు సీటును బీసీల‌కే ఇవ్వ‌డంతో చంద్ర‌బాబు కూడా ఆర్థిక‌, అంగ‌, సామాజిక బ‌లాల ప‌రంగా అంతకు మించిన ధీటైన అభ్య‌ర్థిని ఏలూరు పార్ల‌మెంటు రేసులో పోటీకి నిల‌ప‌డంతో ఇప్పుడు ఏలూరు పార్ల‌మెంటు సీటు రేసు మంచి ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మ‌హేష్ క్లీన్ ఇమేజ్‌తో తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. లోక‌ల్ నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇటు పార్ల‌మెంటు ప‌రిధిలో పోల‌వ‌రం, ఉంగుటూరు సీట్లు జ‌న‌సేన‌కు ఇవ్వ‌గా, కైక‌లూరు సీటును బీజేపీకి ఇస్తున్నారు. పార్ల‌మెంటు సీటులో ఏకంగా మూడు సీట్లు పొత్తులో భాగంగా మిత్ర‌ప‌క్ష పార్టీల‌కు ఇవ్వ‌డంతో అక్క‌డ ఓట్ల బ‌దిలీ అయ్యేలా త‌న‌వంతుగా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో పాటు ఇటు ఫ‌స్ట్ టైం బీసీల‌కు ఇవ్వ‌డంతో ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలో పార్టీ కేడ‌ర్‌లోనూ, పార్టీని అభిమానించే బీసీ వ‌ర్గాల్లోనూ నూత‌న ఉత్సాహం క‌నిపిస్తోంది.

ఇటు పార్టీ బ‌లం, కుటుంబ నేప‌థ్యంతో పాటు పార్ల‌మెంటు ప‌రిధిలో టీడీపీ బ‌లంగా ఉన్నా... పార్ల‌మెంటు ప‌రిధిలో చిన్న‌చిన్న లోపాలు ఉండ‌డంతో వాటిని స‌రిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: