2019 ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల చేత వైసీపీని వినడం జరిగింది.. కొన్ని సందర్భాలలో ఏకంగా సీఎం జగన్ పైన ఘాటుగానే విమర్శలు చేసి వార్తలలో నిలిచారు రఘురామకృష్ణరాజు.. దీంతో నియోజకవర్గానికి దూరంగా ఉండి.. ఢిల్లీ నుండి తన రాజకీయ కార్యక్రమాలను కొనసాగించేవారు.. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో జగన్ ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పొత్తులో భాగంగా తనకు నరసాపురం నుంచి పోటీ చేయాలని చూసిన ఆయనకు మొండి చెయ్యి ఎదురయ్యింది.

బీజేపీ, టీడీపీ , జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస వర్మ ను అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో రఘురామ కృష్ణరాజుకు ఒక గట్టి షాక్ తగిలినట్టు అయింది.. తను మాత్రం పట్టుదలతో కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని ఎంతో ఆరాటపడుతున్నారు.. కానీ బిజెపి జనసేన పార్టీలు ఈయనకు సీటు ఇచ్చే పరిస్థితి కనపడలేదు.. ప్రస్తుతం టీడీపీ మాత్రమే మిగిలి ఉంది. ఆ పార్టీ నుంచి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కృష్ణరాజు.. మరో రెండు రోజుల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం  తెలుస్తుందని.. అది ఎంపీ నా లేకపోతే ఎమ్మెల్యే నా అనే విషయం పై క్లారిటీ రాబోతుందని తెలిపారు.


ఇండియా హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం.. రఘురామ కృష్ణరాజు ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు.. అయితే ఎంపీగా పోటీ చేయాలన్నదే తన కోరిక అని.. కానీ ప్రజలు మాత్రం తనని అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారు అంటూ తెలిపారు.. మరి కొంతమంది తనను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారని కూడా తన మనసులో మాటగా రఘురామకృష్ణరాజు తెలియజేశారు.. అయితే ఇది ప్రజల మనసులో మాట అనే విషయాన్ని పక్కన పెడితే రఘురామకృష్ణ రాజు ఎమ్మెల్యేగా గెలిచి,  అసెంబ్లీ లోకి అడుగుపెట్టి స్పీకర్గా మారి జగన్ అంతు చూడాలన్నదే అతడి చిరకాల వాంఛ అని కొంతమంది చెబుతున్నారు.. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే  టీడీపీ శ్రేణులు మాత్రం రఘురామకృష్ణరాజుకే టికెట్  ఇస్తారని తెలుపుతున్నారు.. దీంతో అక్కడ సీటు కోసం గొడవలో.. ఆ సీటును వైసీపీ పార్టీ గెలుస్తుందా.. మరి అందరికీ సర్దుబాటు చెప్పి రఘురామకృష్ణకు సీటు ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: