2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి కేవలం 11 నెలలు కావోస్తువున్న.. అప్పుడే కూటమినేతలపైన ప్రజలు ఫైర్ అవుతున్నారనే విధంగా వినిపిస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కూడా చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపైన తీవ్ర విమర్శలు కూడా వినిపిస్తున్నాయట. గడిచిన వారం క్రితం సుమారుగా 81 మంది ఎమ్మెల్యేల మీద ప్రజలు అసహనంతో ఉన్నారనే  సర్వే  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు ఎన్నోసార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించిన వారి పనితీరు కూడా మార్చుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ సర్వే కొన్ని విషయాలను తెలియజేస్తోంది.


గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని చెప్పినటువంటి కొంతమంది సర్వేలలో ప్రవీణ్ పుల్లట్ల కూడా ఒకరు.. ఆయన చెప్పిన సర్వేలు దాదాపుగా నిజమయ్యాయి. కూటమి అప్పుడు విజయాన్ని సాధిస్తుందన్న ప్రవీణ్ ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరుపైన ఒక సంచలన ట్విట్ అయితే చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని తెలియజేశారు.

తాజా పరిణామాలు చూసుకుంటే ఈసారి 41 మంది కూటమి ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ రాదని ఒకవేళ వచ్చినా కూడా వారు ఓడిపోతారంటూ సోషల్ మీడియాలో ఒక సంచలన ట్వీట్ ప్రవీణ్ పుల్లట్ల చేశారు. దీంతో ఇది రాజకీయ చర్చకు మరింత దారి తీసేలా కనిపిస్తోంది. ప్రవీణ్ పుల్లట్ల మరొక ట్విట్ చేస్తూ 92 శాతం మంది వన్ టైం ఎమ్మెల్యేలు మొదటిసారి చివరిసారి అంటూ కూడా మరొక కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇది ఎవరి గురించి చేశారన్నది మాత్రం చెప్పలేదు. త్వరలో మరిన్ని విషయాలు బయట పెడతారా? లేదా అన్నది చూడాలి మరి. 164 సీట్లతో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం పరిపాలన పైన ప్రజల అంచనాలను మాత్రం అందుకోలేకపోతున్నది. ముఖ్యంగా సంక్షేమ పథకాలలో ఫెయిల్యూర్ గా మిగిలిపోయిందనే విధంగా అసంతృప్తి మిగిలింది. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: