
ఇటీవలే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శైలజనాథ్ వైసీపీ పార్టీలోకి చేరారు. ఇక వీరే కాకుండా మరి కొంతమంది నేతలు కూడా వైసీపీ పార్టీలోకి చేరేలా ఉన్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు వైసిపి పార్టీలోకి చేరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసిపి హయాంలో చాలామంది ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారట. ముఖ్యంగా పెన్షనర్ విభాగంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో చాలామంది ఉద్యోగ సంఘ మాజీ నేతలు కూడా వైసిపి పార్టీలోకి చేరారు.
ఉద్యోగ సంఘ మాజీ అధ్యక్షుడు.. బివి సుబ్బారావు, బండి శ్రీనివాసరావు, విజయసింహారెడ్డి, తోట సీతారామాంజనేయులు, ఉమామహేశ్వరరావు తదితరులు సైతం వైసీపీ పార్టీలో చేరారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని అందుకే తామంతా వైసిపి పార్టీలోకి చేరుతున్నట్లు తెలియజేశారు నాయకులు. కానీ ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలను అసలు పరిష్కరించడం లేదని అందుకే ఉద్యోగులంతా కూడా వైసిపి పాలననే మెచ్చుకుంటున్నారని తెలుపుతున్నారు. కచ్చితంగా మళ్ళీ వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసి తీరుతామంటూ వారు తెలుపుతున్నారు. మాజి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పాలన గురించి కూడా తెలియజేశారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏపీని చాలా సమర్థవంతంగా నడిపారని ప్రశంసలు కురిపిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇది డేంజర్ బెల్లా కనిపిస్తోంది.