
ఎన్నికల ముందు సంపాదన సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. కాగ్ నివేదికలను పరిశీలిస్తే ఎక్కడ కూడా ఏపీలో అభివృద్ధి కనిపించలేదు, సంక్షేమమే కనిపించలేదు ఈ సంవత్సరం అంతా మోసాలతోనే గడిపేశారు అంటూ తెలిపారు. అంతేకాకుండా అప్పుల సామ్రాట్ గా పేరు సంపాదించారంటూ చంద్రబాబు పైన ఫైర్ కావడం జరిగింది జగన్. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని చాలా అతలాకుతలం చేశారని తెలియజేశారు. ఈ ఏడాదిలో కేంద్రంలో 13.76 శాతం వరకు పెరుగుదల కనిపించినప్పటికీ కానీ రాష్ట్ర రెవెన్యూ పరంగా చూసుకుంటే 3.8 శాతం మాత్రమే ఉన్నదని తెలిపారు.
అలాగే చంద్రబాబు అప్పుల సామ్రాట్ గా మారిపోయారని మా ఐదేళ్లలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడి సీఎంగా చంద్రబాబు ఉన్న 12 నెలల లోని 1,37,546 లక్షల కోట్లు అప్పు చేశారని తాము ఐదేళ్లలో చేసిన అప్పు చంద్రబాబు కేవలం ఒక ఏడాదిలోనే చేసి చూపించారని అప్పులు తేవడంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు అంటూ తెలియజేశారు. అలాగే ఎల్లో మీడియా ఛానల్లు కూడా ఒక మాఫియా లాగా నడుస్తున్నాయని. ఇక రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, మైనింగ్ ,సిలికా ఇలా అన్ని మాఫియాలు కూడా నడుస్తూ ఉన్నాయని తెలియజేశారు. తమ ప్రభుత్వంలో 24 గంటల కరెంటుకి యూనిట్ కి 2.49 రూపాయలకే కొన్నాము కానీ కూటమి ప్రభుత్వంలో రూ.4.60 రూపాయల చొప్పున ఒప్పందం చేసుకొని ప్రజల పైన భారాన్ని వేస్తున్నారంటూ తెలిపారు. అలాగే 2000 కోట్ల విలువైన భూమిని రూపాయికి అమ్మేస్తున్నారంటూ అది కూడా అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నారనే విధంగా తెలియజేశారు.