
ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచు కోట అని చెప్పాలి. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ... అలాగే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గౌరవప్రదమైన సీట్లు గెలుచుకునేది. అలాంటిది 2019 ఎన్నికలలో తెలుగుదేశానికి జిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు పశ్చిమం - రేపల్లె నియోజకవర్గం మిగిలిన 15 సీట్లతో పాటు నరసరావుపేట - బాపట్ల పార్లమెంటు సీట్లలో వైసీపీ జెండా ఎగిరింది. అయితే 2024 ఎన్నికలలో జిల్లాలో ఉన్న మూడు పార్లమెంటు సీట్లతో పాటు 17 ఎమ్మెల్యే సీట్లలో కూటమి పార్టీలు క్లీన్ స్విఫ్ట్ చేశాయి. తెనాలి నుంచి జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ విజయం సాధించిగా ... మిగిలిన అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క ఓటమి ఇక్కడ వైసిపిని పూర్తిగా దెబ్బ కొట్టింది. పలు నియోజకవర్గాలలో పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది.
గుంటూరు ఎంపీగా పోటీ చేసిన కిలారు రోశయ్య ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే తాడికొండ నుంచి పోటీ చేసిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా పార్టీని వీడారు. అలాగే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన మాజీ మంత్రి విడుదల రజిని చిలకలూరిపేటకు వెళ్లిన ఆమె కేసులలో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపాడు - తాడికొండ నియోజకవర్గం పాటు గుంటూరు పశ్చిమం - గుంటూరు పార్లమెంటు , నరసరావుపేట పార్లమెంటు సీట్లలో వైసీపీని నడిపించే నాయకుడు లేక అనాధలా మారిపోయింది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని తప్పించి ఒక రెడ్డి గారికి ఇన్చార్జి పదవి ఇచ్చిన ఆయన పార్టీని నడిపించే పరిస్థితి లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొన్నూరు తో పాటు మంగళగిరి నియోజకవర్గాలలోను పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఏది ఏమైనా ఒక్క ఓటమి తో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ సీను మొత్తం తలకిందులు అయిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు