- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

రాజకీయాల్లో జంపింగులకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎవరు ఆర్థికంగా బలంగా ఉంటే వారితోనే రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. దీంతో పార్టీలు మారుతున్న వారు పెరుగుతున్నారు. స్వార్థ ప్రయోజనాలు , పదవులు ఆశించే వారు .. వ్యాపారాలు ఉన్నవారు ఎంత నమ్మకంగా ఉన్నా కూడా పార్టీలకు రామ్ రామ్ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జంపింగ్ లకు షాకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కడపలో జరుగుతున్న మహానాడులో రాజకీయ నేతలు జంపింగ్ ల‌పై మాట్లాడిన చంద్రబాబు కార్యకర్తల ముందు వారికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదని తేల్చేశారు. టిడిపిలోకి వలస పక్షులు వస్తాయి పోతూ ఉంటాయి. వీరి కంటే కూడా పార్టీకి కార్యకర్తలకు కీలకం అని వ్యాఖ్యానించారు. ఇక పార్టీలో ఉన్న కోవర్టుల గురించి కూడా చంద్రబాబు సంచలనం వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవర్టుల గురించి మాట్లాడుతూ కోవ‌ర్టులు గా వ్యవహరించినందుకు పార్టీలకు కొందరు వస్తున్నారని ... వారి విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.


కోవ‌ర్టులు కార్యకర్తలను దూరం చేసే ప్రక్రియలు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయని అన్న చంద్రబాబు అలాంటి చోట ఆ కోవర్టుల విషయంలో నిర్మొహమాటంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏది ఏమైనా అటు జంపింగ్లు ... ఇటు కోవ‌ర్టుల విషయంలో మహానాడు వేదికగా చంద్రబాబు సూటి గా ... సుత్తి లేకుండా తన నిర్ణయాన్ని చెప్పేశారు. ఎందుకంటే చాలా నియోజకవర్గాలలో జంపింగ్ నాయకులు హవా నే కొనసాగుతోంది. దీంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: