బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. రాజకీయ వ్యూహాల్లో దిట్ట అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు .. ఆయన ఒక్కసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే అది ప్రత్యర్థులకు ఉహించ‌ని ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది . అయితే ఇప్పుడు కేసీఆర్ ఊహించని విధంగా తన వ్యూహాన్ని మార్చేశారు .. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలు , నాణ్యత పరిమాణాలపై ఏర్పాటుచేసిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఈనెల 5న కెసిఆర్ హాజరు కావలసి ఉంది .. అయితే విచారణకు హాజరయ్యేందుకు కేసిఆర్ కూడా ఎంతో సానుకూలంగానే ఉన్నా .. ఎందుకో గని సోమవారం ఆయన తన నిర్ణయాన్ని ఊహించిన విధంగా మార్చుకున్నారు . ఈనెల 5 న కాకుండా 11న కమిషన్ విచారణకు హాజరుకావాలని సంచల నిర్ణయం తీసుకున్నారు .


ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ సోమవారం కమిషన్‌కు తెలియజేసింది .. అలాగే కేసీఆర్ విచారణకు  హాజరవుతారని .  కానీ ఈ నెల 5న కుదరదని 11న ఆయన విచారణకు వస్తారని ఆ పార్టీ కమిషన్‌కు లేఖ రాసింది .. అలాగే ఈ లెక్కపై కమిషన్ కూడా  త్వ‌ర‌తిగ‌తిన  స్పందించింది .  కెసిఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈనెల 11న విచారణకు రండి అంటూ కమిషన్ తన సమ్మతిని పంపించింది .  కాలేశ్వరం కమిషన్ విచారణకు కేసిఆర్ ఈనెల 5న కాకుండా 11న కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు .. అయితే ఇప్పుడు ... ఊహించ‌ని విధంగా కేసీఆర్ తన నిర్ణయం మార్చుకోవటం వెనుక నిర్ణయాలు ఏమిటన్న దానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది .. కాలేశ్వరం కమిషన్ విచారణకు కేసిఆర్ తో అప్పటి సాగునీటి మంత్రిగా ఉన్న తన్నీరు హరీష్ రావు , ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లు కూడా విచారణకు హాజరు కాబోతున్నారు . అయితే కేసీఆర్‌ను ఐదున రమ్మన్న కమిషన్ .. 6న హరీష్ ను , 9న ఈటలను విచారణకు రమ్మని పిలిచింది .. అలాగే ఈ నోటీసులు పై కేసీఆర్ , హరీష్ రావులు ఇప్పటికే పలుమార్లు చర్చోప చర్చలు జరిపారట .. అలాగే ఈ చర్చలో ఫలితంగానే తాజాగా కెసిఆర్ తన వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తుంది .



అలాగే కమిషన్ విచారణకు ముగ్గురు ఒకే విధంగా సమాధానం చెప్పాలి .. అలాగైతేనే విచారణ నుంచి అందరూ బయట పడగలమని హరీష్ రావుతో కెసిఆర్ చెప్పినట్లుగా తెలుస్తుంది .. ఈ క్రమంలోనే ఈటల తోనూ హరీష్ బేటి అయ్యారు అన్న వార్తలు వినిపించాయి .  అయితే ఈ వార్తలపై హరీశ్, ఈటెల ఇద్దరు ఖండించారు . అయితే ఇందులో ఎంతవరకు నిజంఉంది అనేది తెలియదు కానీ .. ఇప్పుడు ముందుగా హరీష్ , ఈటల విచారణ పూర్తయిన తర్వాత వారు ఏం చెబుతారు అన్న దానిపై పరిశీలన చేసి ఆ తర్వాత విచారణకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచించినట్టుగా తెలుస్తుంది .. ఈ కారణంగానే 6న హరీష్ రావు , 9న ఈటల విచారణ పూర్తవగానే ... 11న కమిషన్ ముందుకు వెళ్లాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్టు తెలంగాణ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: