
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 100కు పైగా అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అయితే మండలానికి ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే మాత్రం పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది చెప్పవచ్చు. అన్న క్యాంటీన్ల అమలు వల్ల ఎంతోమంది పేద ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా మేలు జరగనుందని చెప్పవచ్చు.
ఈ పథకం తక్కువ ఖర్చుతో ప్రభుత్వానికి మేలు చేసే పథకం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా లెక్కన ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మండలానికి ఒక అన్న క్యాంటీన్ ను అమలు చేస్తే కూటమి సర్కార్ కు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం అమలు వల్ల దీర్ఘకాలంలో ఏంటో బెనిఫిట్ కలగనుంది చెప్పవచ్చు. ప్రస్తుతం కేవలం 5 రూపాయాలకే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించడం సాధారణ విషయం కాదు. బయట ఖర్చులు ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు ఈ పథకం ప్రయోజనాలు పొందుతున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు