
కృష్ణ నదిపై నిర్మించిన నాగార్జునసాగర్ డ్యాం 1965లో పూర్తి చేశారు. ఇది ఏపీలో పల్నాడు జిల్లా ,తెలంగాణలో నల్గొండ జిల్లా సరిహద్దులో కలదు. అప్పటి నిల్వ సామర్థ్యం 408.23 టీఎంసీలు ఉండగా.. హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం 1967 నుంచి 1974 మధ్యలో 14.4 టీఎంసీలు, అలాగే 1978 నాటికి 48.72 టీఎంసీలు, 2009 నాటికి 79.21 టీఎంసీలు , 2009లో వచ్చిన వరదల కారణం చేత 2010 నాటికి నీటి నిల్వ సామర్థ్యం 312.0456 టీఎంసీలు చేరింది. దీన్నిబట్టి చూస్తే 96.19 టిఎంసీల స్వామర్ద్యం కోల్పోయింది. డ్యామ్ నిర్మాణ సమయంలో ఆ డ్యామ్ లో లైవ్ స్టోరేజ్ నీరు 258.40 టీఎంసీలు ఉండగా , 2012లో వచ్చేసరికి 227.40 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు రివైంజ్ అంచనాలు తెలియజేస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ డ్యామ్ కింద లక్షల మంది తాగునీటి అవసరాల కోసం ఉపయోగించడమే కాకుండా 22 లక్షల ఎకరాల నీరు పంట పొలాలకు అందుతోంది. కుడి కాలువకు 132 టీఎంసీలు, ఎడమ కాలువకు 132 టీఎంసీలను కేటాయించారు.అయితే ఒక్కో టిఎంసితో 10వేల ఎకరాల భూమికి నీరు అందించవచ్చు. ఇంతటి ప్రాధాన్యం కలిగే ఉన్న ఈ నాగార్జునసాగర్ డ్యాం నీటి నిలువ పైన ఇప్పుడు పూడిక తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దీంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. తీరాలు కోతకు గురవడం వల్ల జరాశయంలో చెట్లు పడిపోతున్నాయి, అలాగే నీరు నిండుగా ఉన్నప్పుడు కోతకు గురై పూడిక చేరుతోందట. మరి వీటి పైన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.