సాధారణంగా టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది అంటే చాలు ఏ జట్టు ఎలా రాణిస్తుంది అన్న విషయంపై ప్రేక్షకులందరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న టీమ్ లు బాగా రాణిస్తాయని అందరూ భావిస్తూ ఉంటారు. ఎప్పటి లాగానే పసికూన జట్లు అటు వరుస ఓటములతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం ఖాయం అని నమ్ముతూ ఉంటారు. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమైన వరల్డ్ కప్ లో భాగంగా  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఇలాంటి అంచనాలే పెట్టుకున్నారు.


 కానీ క్వాలిఫైయర్ మ్యాచ్ల దగ్గర నుంచి మొదలుపెడితే ఇక నిన్నటికి నిన్న ముగిసిన సూపర్ 12 మ్యాచ్ ల వరకు కూడా ఎన్నో మ్యాచ్ లలో ప్రేక్షకుల అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న టీమ్ లకు అటు పసికూన జట్లు వరుసగా షాక్ లు ఇస్తూ ఉండడం గమనార్హం. దీంతో ఇలా పసికూన జట్ల ఆట తీరు చూసి క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యంలో మునిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఏడాది టీ20వరల్డ్ కప్ అత్యంత ఉత్కంఠ భరితంగా జరగగా.. ఇక ఇప్పటివరకు నమోదైన సంచాలనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 16వ తేదీన జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లోనే సంచలనం నమోదు అయింది. ఏకంగా వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న శ్రీలంకను పసికూన నమిబియా జట్టు ఓడించింది.

 బౌలింగ్ విభాగంలో బాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్న పాకిస్తాన్ జట్టును  ఊహ కందని విధంగా పసికూన జింబాబ్వే జట్టు ఓడించి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది  అని చెప్పాలి.


 ఇక ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టును పసికూన ఐర్లాండ్  ఓడించి ఊహించని షాక్ ఇచ్చింది.

 ఇటీవల ఏకంగా ప్రత్యర్ధులను వనికించే భయంకరమైన సౌతాఫ్రికా జట్టును కలలో కూడాఊహించని విధంగా నెదర్లాండ్స్ జట్టు ఓడించి విజయం సాధించింది అని చెప్పాలి.

 అంతేకాదు ఇప్పుడు వరకు ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో రెండు సార్లు టి20 వరల్డ్ కప్ సాధించిన వెస్టిండీస్ జట్టు చిన్న టీం  చేతిలో ఓడిపోయి కనీసం అటు సూపర్ 12 కి కూడా క్వాలిఫై కాలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc