టాలీవుడ్‌ కింగ్ నాగార్జునకి సంబంధించిన తాజా కోర్టు తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది – ఇకపై నాగార్జున   అనుమతి లేకుండా ఆయన ఫోటో, వాయిస్, పేరు వాడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు! ఈ ఆదేశంతో ట్రోలింగ్ బ్యాచులు, సోషల్ మీడియా మిస్యూజ్ క్రియేటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. నిజానికి నాగార్జునకు రెగ్యులర్ మీడియా, ఫ్యాన్స్‌తో ఎప్పుడూ సమస్య ఉండదు. కానీ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ఆయన పేరు, ఇమేజ్, బ్రాండ్‌ను వాడుకుని కొందరు కించపరిచేలా వీడియోలు, రీల్స్ తయారు చేయడం ప్రారంభమైంది. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు చేస్తూ, కళ్యాణ్ జువెలర్స్ వంటి టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్న నాగార్జున ఇమేజ్‌పై ఈ విధమైన దాడులు జరగడంతో చివరికి న్యాయస్థానం ఆశ్రయించాల్సి వచ్చింది.

కోర్టు తీర్పుతో ఇప్పుడు “నాగ్ పేరు వాడితే జాగ్రత్త.. ఇక చట్టపరమైన ఫలితాలు తప్పవు” అన్న మెసేజ్ స్పష్టంగా వెళ్లిపోయింది. నాగ్ దృష్టికి ఒక ఇష్యూ వచ్చి కూడా ఆయన మౌనం వహిస్తే అది అంగీకారంగా పరిగణించవచ్చు. లేకపోతే నేరుగా లీగల్ నోటీసులు రావడం ఖాయం. అంటే ఇక ట్రోలర్స్ ఎలాంటి ఆటలు ఆడలేరు. ఇటీవల ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా ఇలాంటి రక్షణ కోర్టు నుంచి పొందారు. ఇక నాగార్జున ఈ దిశగా అడుగు వేసిన తర్వాత “మిగతా స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇదే దారిలో వెళతారా?” అనే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది. ముఖ్యంగా AI టెక్నాలజీ వాడి ఫేక్ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు.

న్యాయ నిపుణుల ప్రకారం – ఈ కేసు ఉద్దేశ్యం ప్రతి ఫోటో, వీడియో వాడాలంటే పర్మిషన్ తీసుకోవాలని కాదు. కేవలం దుర్వినియోగం చేసి ఇమేజ్‌కి హాని కలిగించే వారిని అడ్డుకోవడమే. నిజాయతీగా ఫ్యాన్స్ చేసే ఎడిట్స్, పాజిటివ్ ప్రమోషన్స్‌కి ఎలాంటి సమస్య ఉండదు. కానీ ట్రోలింగ్ లేదా తప్పుగా చూపించే కంటెంట్‌కి మాత్రం ఇక లీగల్ సాక్ష్యాలు తప్పవు. నాగ్ తీసుకున్న ఈ లీగల్ షీల్డ్ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, మొత్తం సినీ ఇండస్ట్రీకి మోడల్‌గా మారే ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ పబ్లిసిటీ తగ్గకుండా, ట్రోలర్లకు గట్టి వార్నింగ్ ఇవ్వడమే ఈ తీర్పు ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి: