ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పెట్రోల్, డీజల్ వాహనాలపై చాలా విసిగిపోయారు.. రోజురోజుకీ పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. ఇక ఇదే అదునుగా చూసుకొని కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను సరికొత్తగా తయారుచేసి విడుదల చేస్తున్నాయి కొన్ని ఎలక్ట్రిక్ దిగ్గజ సంస్థలు. ఇక ప్రస్తుతం ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇదే బాటలో పడుతున్నాయి.. కేవలం ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్లను, ఎలక్ట్రిక్ బైక్ లను మనం చూసే ఉంటాము.. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కూడా సరికొత్త రూపంలో వచ్చింది.

ఈ మూడు చక్రాలు కలిగిన ఎలక్ట్రిక్ ఆటో ను..mahindra ఎలక్ట్రిక్ సంస్థ సబ్సిడీ నుంచి ఎలక్ట్రిక్ ఆటోని అందిస్తోంది. ఇక ఈ ఆటోకి ఆల్ఫా కార్గో అనే పేరుతో త్రీ వీలర్ ను విడుదల చేసింది మహేంద్ర గ్రూప్ సంస్థ.. ఇక ఈ ఆటోను ఈ ఏడాది జనవరి 18వ తేదీన మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని ఎలక్ట్రిక్ ఆటో దేశ రాజధాని ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ నందు దీనిని విడుదల చేసింది. దీని ధర.1.44 లక్షలు ఉన్నట్లుగా తెలియజేశారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు..310 కేజీల లోడుతో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గరిష్ట వేగంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. ఈ విషయాన్ని మహేంద్ర కంపెనీ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది.

ఈ మహేంద్ర ఎలక్ట్రికల్ ఆటోను 48V/15 A చార్జర్ సహాయంతో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక దీనిని కూడా మన మొబైల్ ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటారో అంతే సులువుగా పెట్టుకోవచ్చుని మహేంద్ర కంపెనీ సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం ఇంధన ధరలు పెరిగిపోవడంతో కొన్ని నగరాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడంతో.. ఈ ఎలక్ట్రిక్ ఆటో ని కనుగొన్నామని తెలియజేశారు. ఇక మీదట లగేజ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ మహేంద్ర పోర్ట్ ను తయారు చేశామని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: