ఈ సీరియల్ లో హీరోయిన్ రోల్ చేస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తన అందం , అభినయంతో ప్రేక్షకులను అభిమానులుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది వేద. ఇక వేద ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు. లేదా మొదటి సారి బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో రోజుల బంధం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
వేద అసలు పేరు దేబ్జానీ మోదక్.. మార్చి 20వ తేదీన కోల్ కత్తాలో జన్మించింది. వేద బెంగాలీ అమ్మాయి. వేదా కు ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక వేద విద్యాభ్యాసం విషయానికి వస్తే, బీ ఎడ్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే వేద సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట వేద బెంగాలీలో 3 సినిమాలు చేసింది.ఆ తర్వాత బెంగాలీ లో 7 సీరియల్స్ లో నటించింది. తమిళ్ లో కూడా 2 సీరియల్స్ లో నటించారు. ఈమెకు మంచిపేరు వచ్చింది మాత్రం బెంగాలీ సీరియల్స్ ద్వారా బాగా గుర్తింపు వచ్చింది..అని చెప్పవచ్చు.ఇక తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది..ఈ సీరియల్ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి