
ఇలా రోజు రోజుకు ఇక మొబైల్ కి బానిసగా మారిపోతున్న మనిషి ఇక ఒక్క క్షణం పాటు మొబైల్ పక్కన లేకపోయినా కూడా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నేటి రోజుల్లో నీళ్లు తిండి లేకపోయినా ఉండగలుగుతారేమో కానీ మొబైల్ లేకపోతే మాత్రం ఒక్క సెకండ్ కూడా ఉండలేరేమో అన్న విధంగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇలా మొబైల్ పిచ్చి లో పడిపోయి ఎంతో మంది రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో యువతి ఫోన్ మాట్లాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంది. కానీ ఆ యువతిని చూసిన తర్వాత మాత్రం నీ ఫోన్ పిచ్చి తగలెయ్య మరి ఇంత దారుణమా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంది అని చెప్పాలి. యువతి ఫోన్ మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా అంతలో వేగంగా రైలు తీసుకొచ్చింది. దీంతో పట్టాల పైనే పడుకుంది యువతీ. చిన్న గాయాలతో చివరికి బయటపడింది. అయితే ట్రైన్ యువతిపై నుంచి వెళ్తున్న సమయంలో కూడా ఏకంగా యువతి ఫోన్లో మాట్లాడుతూనే ఉంది.. దీంతో ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు షాక్ అవుతున్నారు. హర్యానాలోని రోక్తక్ లోఘటన జరిగినట్లు తెలుస్తోంది.