
ముందుగా ఒక మంచి సాంగ్ ఎంచుకొని ఇక ఆ తర్వాత ఆ సాంగ్ పై డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇక పెళ్ళికొడుకు ఫోటోలు ఫోజులిస్తున్న సమయంలో స్టేజి మీదకి వచ్చి డాన్స్ లతో అదరగొడుతూ ఉంటారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే కేవలం వధూవరుల స్నేహితులు మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు నేరుగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సైతం డాన్సులు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా డాన్స్ కు సంబంధించిన వీడియోని వైరల్ గా మారిపోయింది.
షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమాలోని బేషారం రంగ్ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ పాటపై వివాదం చెలరేగడం కూడా పాట బాగా హిట్ కావడానికి కారణమైంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక పెళ్లిలో భాగంగా పెళ్లి కొడుకు స్నేహితులు బేశారం రంగ్ పాటపై డాన్స్ చేశారు. ఏకంగా దీపిక పదుకొనే లాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ స్టెప్పులు వేశారు. దీంతో ఇక వారి ఫన్నీ డాన్స్ చూసి అక్కడున్న వారందరూ కూడా తెగ నవ్వుకున్నారు అని చెప్పాలి. ఏకంగా దీపికా పదుకొనే వేసిన హుక్ స్టెప్పును కూడా వరుడు ఫ్రెండ్స్ ట్రై చేయడం ఇక ఈ వీడియోలో చూడవచ్చు.