గత పది రోజుల నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలలో వర్షం ముంచేత్తి పోస్తున్న విషయం తెలిసిందే. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ వాతావరణ శాఖ ఒక తాజా ప్రకటన విడుదల చేసింది. బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వద్ద కొనసాగుతూ ఉంది. ఇక ఈరోజు ఉదయం నాటికి అది మరింత బలపడి వాయుగుండం గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే ఈరోజు సాయంత్రానికి అంతా బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం అలాగే అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో మే 10వ తేదీ కూడా అక్కడే ఆగ్నేయ దిశగా ప్రయాణించి అల్పపీడనం తుఫానుగా మారబోతోంది. ఇది మొదట్లో ఉత్తర వాయువ్య దిశగా మే 11 వరకు కదులుతుంది అని ఆ తర్వాత క్రమంగా పుంజుకొని ఉత్తర ఈశాన్య దిశగా బాంగ్లాదేశ్ మయన్మార్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలను కూడా అందజేసింది ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానం వంటి ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారుగా వర్షాలు పడే అవకాశం ఉంది . అలాగే ఉరుములతో మెరుపులతో కూడిన జల్లులు కూడా కురుస్తాయట.

అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రెండు నుండి నాలుగు డిగ్రీల వరకు పెరగవచ్చు అని . ఇక రేపు కూడా తేలిక పార్టీ నుండి మొదలయ్యి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం. అంతే కాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే చోట అస్సలు ఉండకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షం పడే సమయంలో సేఫ్ గా ఉండే ప్రదేశాలలో మాత్రమే ఉండాలని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: