తెలుగు సినీ పరిశ్రమలో మంచి విజయాలను అందుకుంటూ కెరియర్ ను ఆచితోచి ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ నటుడి కొంత కాలం క్రితమే గామి అనే ఓ వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చాందిని చౌదరి ఓ కీలకమైన పాత్రలో నటించింది. చాలా తక్కువ పాత్రలతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇందులో విశ్వక్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇలా గామి మూవీ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న ఈ నటుడు తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... కృష్ణ చైతన్యమూవీ కి దర్శకత్వం వహించాడు. సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని మే 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ చిత్రం నుండి రెండు పాటలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

ఇక తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాలోని మూడవ సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీలోని బ్యాడ్ అంటూ సాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ సాంగ్ ను మే 10 వ తేదీన ఉదయం 12 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ప్రస్తుతానికి నిలబడి ఉన్నాయి. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs