ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి ..? ఆ సినిమాలకు సంబంధించిన రన్ టైమ్ మరియు సెన్సార్ వివరాలను తెలుసుకుందాం.

ప్రతినిధి 2 : నారా రోహిత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ప్రతినిధి మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ... ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎస్ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కృష్ణమ్మ : టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరో గా రూపొందిన ఈ సినిమాని మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. వి వి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కొరటాల శివ సమర్పిస్తున్నాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 12 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆరంభం : ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

లక్ష్మీ కటాక్షం : ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎస్ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 28 నిమిషాల నిడివితో  ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక ఈ మూవీ లతో పాటు రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లీడర్ మూవీ కూడా ఈ వారం రీ రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: