సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఎంతోమందికి ఆదర్శం అని చెప్పొచ్చు. కండక్టర్ గా మొదలైన ఆయన జీవితం ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగే స్థాయికి వచ్చింది .అయితే రజనీకాంత్ కి ఎప్పుడు ధనవంతుడిని అవ్వాలి అనే కోరిక ఉండేదట. ఆ కల ఆయనకి ఇన్నాళ్లకు నెరవేరింది ప్రస్తుతం. ఆయన ఒక్కొక్క సినిమాకి గాను వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఒక స్టార్ హీరో ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నారట. ప్రస్తుతం ఇదే

 వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే రజనీకాంత్ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ నేను బస్ కండక్టర్ అని చాలామందికి తెలుసు అంతకుముందు ఆఫీస్ బాయ్ గా కూలీగా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఇప్పుడు ధనవంతుడిని అయ్యాను. ఎప్పటినుండో నేను ధనవంతుడిని కావాలని కోరుకున్నాను చిన్నతనం నుండి నేను దీనికి భయపడే వాడిని

 కాదు. కానీ ఒక్కొక్క సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాను.. అలా అనిపించిన ప్రతిసారి దేవుడిని పూజించేవాడిని.. దేవుడి ఫోటో చూస్తూ ఉండిపోయేవాడిని.. ఆ తర్వాత నా నిర్ణయం మారిపోయింది అంటూ చెప్పాడు. 'ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. తెల్లటి గడ్డంతో ఉన్న సంతనోర్వా నదికి అవతలివైపు కూర్చున్నాడు. అతను నన్ను తన దగ్గరకు పిలిచాడు. నేను ఈత కొట్టలేదు, కానీ అతని దగ్గరికి పరుగెత్తాను. మరుసటి రోజు ఆ దేవుడు ఎవరు అని అడిగితే అందరూ శ్రీ రాఘవేంద్ర స్వామి అని చెప్పారు. నేను ఒక మఠానికి వెళ్లి ధనవంతుడిని అవ్వాలని వేడుకున్నాను. ప్రతి గురువారం ఉపవాసం ప్రారంభించారు. తర్వాత కండక్టర్‌గా మారి ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. అప్పుడు బాలచందర్ సార్ నన్ను గుర్తించారు. ఇప్పుడు స్టార్ అయ్యాను' అని రజనీ అన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: