ప్రతిపక్షాల సంగతి పక్కన పెడితే జగన్ కి సొంత చెల్లెళ్ళే ముచ్చెమటలు పట్టిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అవును... షర్మిల, సునీతలు వివేకా హత్యే ఆయుధంగా జగన్‌, ఆయన పరివారాన్ని మాటల తూటాలతో దాడి చేస్తున్నారు. ఎంతలా అంటే అది చెప్పడానికి వీలు కానిది. జగన్‌ ఓ నర హంతకుడు. గొడ్డలి తీసుకుని వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ నరికేయాలని అనుకుంటాడు. వారు మాత్రమే ఎన్నికల్లో సింగల్‌ ప్లేయర్‌గా ఉండాలి అనుకుంటాడు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్‌, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగినట్టు? వివేకా హత్య జరిగిన రోజు అవినాష్‌రెడ్డి....భారతితో ఫోన్‌లో ఏం మాట్లాడారు? అనేటువంటి ప్రశ్నలు కడప సిస్టర్స్‌ వైఎస్‌ షర్మిల, డాక్టర్‌ నర్రెడ్డి సునీతలు ఏకధాటిగా అన్నపై సంధిస్తుంటే జగన్‌కు ఊపిరి సలపనివ్వడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి.

అవును, సొంత సిస్టర్స్ ఇపుడు జగన్ కి పక్కలో బల్లెంలా కాదు, గొడ్డలిలా మారారు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా వైఎస్‌ వివేకా హత్య కేసును ఆయుధంగా మలుచుకుని జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రోజుకో అంశాన్ని ఎత్తుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రచారం చేస్తూ జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. 1996 ఎన్నికల్లో వైఎస్‌ ఎలాగైతే బోటాబొటీ మెజారిటీతో బయటపడ్డారో... ఇప్పుడూ అలాంటి పరిస్థితిని అవినాష్‌రెడ్డికి వారు తీసుకొస్తున్నారు అనడంలో సందేహమే లేదు. కాగా ఈ అక్కచెల్ళెళ్లు లెవనేత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారే లేకపోవడం దురదృష్టకరం.

వైఎస్‌ అవినాష్‌రెడ్డి అడపాదడపా మాట్లాడుతున్నా... ఆ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో మాత్రం లేరు. ఈ నేపథ్యంలో చివరికి జగనే రంగంలోకి దిగి పులివెందుల నడిబొడ్డున వైఎస్‌ అవినాష్‌రెడ్డి 'చిన్న పిల్లాడు' అంటూ వెనకేసుకు రావడం కొసమెరుపు. అయినా ఆ మాటలూ ఇపుడు పెద్దగా ప్రభావం చూపడం లేదని వినికిడి. వైఎస్సార్‌ జిల్లాలో ఏ ఊరు, ఏ వీధిలోకి వెళ్లి ఏ గడపను అడిగినా వివేకాపై గొడ్డలి వేటు వేసింది ఎవరంటే? కథలు కథలుగా చెబుతారు మరి! ఈ క్రమంలోనే షర్మిల, సునీత మాట్లాడుతున్న మాటలు జగన్‌ను పిడుగుల్లా తాకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకీ వారు తూటాల్లా కౌంటర్‌ ఇవ్వడం మనం గమనించవచ్చు. అవును, ఇపుడు కూటమిలో ఉన్న ప్రధాని నాయకులకంటే కూడా సొంత సిస్టర్స్ జగన్ ని గడగడలాడిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: