సృష్టికి మూలం మహిళ..ఓర్పుకు నిలువెత్తు నిదర్శనం మహిళ..ప్రేమానురాగలతో కొండంత బలాన్ని ఇచ్చేది మహిళ..మహిళ లేనిదే ఈ సృష్టి లేదు అనేది జగమెరిగిన సత్యం. ఒకప్పుడు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అనే భావన నుంచి..పరిమితులనేవి లేకుండా విశ్వ వ్యాపించింది. మహిళల యొక్క మెదస్సు ..! గల్లీ నుంచి గగనయానం వరకూ మహిళలు సాధించని ఘనతే లేదు. సామాజిక పరంగాను, రాజకీయ పరంగాను, మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా సమాజంతో తమ పాత్ర పోసిస్తున్నారు. అంతే కాకుండా ఆర్థిక రంగంలోనూ, వాణిజ్య రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ మహిళలు చెరిగిపోని ముద్ర వేస్తున్నారు.

ఈ సృష్టిలో మహిళలకు ఎప్పటికీ చెరిగిపోని స్థానం ఉంది. అందువల్లే మహిళల ప్రాముఖ్యతను గుర్తు చేసుకొనేందుకు ప్రపంచం అంతకూడా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. దీంతో ఉమన్స్ డే సందర్భంగా సమాజంలో వారి పాత్రను గుర్తు చేసుకుందాం.. మహిళలకు ఆదికాలం నుండి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో సింధూనాగరికత కాలం నుండి కూడా భారతీయులు స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీని దేవతగా (అమ్మతల్లి) పూజించేవారు. అలాగే 1947, ఆగష్టు 15 అనంతర మేర్పడిన స్వతంత్ర భారతదేశాన్ని కూడా "భారతమాత" గా కొనియాడుతూ, గౌరవిస్తూ.. పూజిస్తూ ఉండటం మన దేశంలో స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.

మరి నాగరికత అభివృద్ది చెందని రోజులలో స్త్రీలకు గౌరవం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే పురుషాధిపత్యం పెరిగిపోవడం వల్ల స్త్రీల పట్ల చులకన భావం నెలకొంది. దీంతో పురుషులు మహిళలపై అధికారం చెలాయిస్తూ..కొంత కాలానికి మహిళలను కట్టు భానిసలుగా మార్చారు. అంతే కాకుండా వంటింటికే వారిని పరిమితం చేశారు. అయితే ప్రస్తుతం రోజులు మారాయి. నేటి సమాజంలో మహిళలు కూడా అన్నీ రంగాలలో రానిస్తున్నారు.

 ప్రస్తుతం మహిళలు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసి పోయి అంచెలంచెలుగా ఎదుగుతుండడం నిజంగా అభినందించవలసిన విషయం. విద్యారంగంలో బాలికలదే అగ్రస్తానం.ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం విద్యావంతం అవుతుంది. అప్పుడు సమాజం, దేశం మొత్తం విద్యావంతంగా మారుతుంది. అంతటి ఘనత వహించే స్త్రీల పట్ల ప్రతి పురుషుడు కూడా గౌరవంగా వ్యవహరిస్తూ లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. ఆ బాద్యతను ప్రతి పౌరుడుకూడా అంకితభావంతో మెలుగుతూ స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకుందాం..  

మరింత సమాచారం తెలుసుకోండి: