కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోయింది. ఆఫ్గానిస్థాన్ మొత్తం తాలిబన్లు ఆక్రమించడంతో... కాబూల్ నుంచి ప్రజలంతా ఇతర దేశాలకు పారిపోతున్నారు. దీంతో విమానాశ్రయంలో రద్దీ ఎక్కువైంది. వేలాది మంది పౌరులు ఆఫ్గాన్ ను వీడి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు కూడా జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. మరి కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు తాలిబన్లు... మరో వైపు భద్రత బలగాల కాల్పులతో పరిస్థితి భయానకంగా మారింది. ఇప్పటికే ఆఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. దీంతో ప్రజలు కూడా ఇతర దేశాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున విమానాశ్రయం చేరుకున్నారు. హమీద్ కర్జాయ్ విమానాశ్రయం టెర్మినల్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. రద్దీ ఎక్కువ కావడంతో గగనతలాన్ని ఆఫ్గాన్ మూసివేసింది. దీంతో ఇతర దేశాల నుచి విమానాలు అక్కడికి వెళ్లలేకపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: