మైలవరం టీడీపీలోని రెండు వర్గాల నేతలైన దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ చేతులు కలిపారు.  గొల్లపూడిలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ కలిశారు. ఇవాళ వసంత నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందులో పాల్గొనాలని దేవినేని ఉమాను వసంత కృష్ణప్రసాద్‌ కోరారు. అందుకు ఉమా అంగీకరించారు.

నేను తెలుగుదేశం పార్టీలో 5 సార్లు బీఫార్మ్ తీసుకున్నాను.. కుటుంబం లాంటి పార్టీలో కొన్ని కలహాలు వస్తుంటాయి..సద్దుమనుగుతూ ఉంటాయి.. నాది తెలుగుదేశం కుటుంబం.. ప్రాణం పోయేంత వరకు మైలవరం ప్రజలకు అండగా ఉంటానని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నేను, వసంత రాజకీయ పోరాటాలు చేశాం.. నేను, వసంత ఎపుడు మైలవరం పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటాం.. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలంటే అందరం కలవాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందరం కలిసి పనిచేసి కూటమి ఎమ్మెల్యేగా వసంత, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించుకుందామన్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: