ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా కొంతమంది మాత్రం మూఢనమ్మకాల ఊబిలోని కూరుకుపోతూ చేయకూడని పనులన్నీ చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో ఏది నిజం ఏది అబద్దం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు మనుషులు. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని నమ్ముతూ ఎన్నో విచిత్రమైన పనులు చేస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 నేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను విశ్వసించే వారు చాలామంది ఉన్నారు అన్న దానికి నిదర్శనంగా ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల శ్వేత అనే యువతీ తన తండ్రితో కలిసి ఢిల్లీలో ఉంటుంది. అయితే ఇటీవల తండ్రికి తీవ్రమైన జబ్బు చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇక ఎవరూ లేని ఒంటరిగా మారిపోయింది శ్వేత. ఇక తండ్రి లేడు అన్న బాధను అస్సలు జీర్ణించుకోలేకపోయింది. అయితే ఒకసారి చనిపోయిన వారిని మళ్లీ బ్రతికించడం కష్టం అని తెలిసిన ఎందుకో తండ్రిని తిరిగి బ్రతికించుకోవాలనే ఆశ మాత్రం ఆమెను మూఢనమ్మకాల వైపు నడిపించింది.


ఈ క్రమంలోనె ఒక తాంత్రికుడిని  సంప్రదించగా ఏకంగా ఒక మగ బిడ్డను నరబలి ఇస్తే తండ్రి తిరిగి బతికి వస్తాడని తాంత్రికుడు చెప్పడంతో తండ్రి తిరిగి వస్తే అంతకంటే ఇంకేం కావాలి అని ఆలోచించింది శ్వేత. ఇక పక్క ప్రణాళికలు వేసుకుని మగ బిడ్డ కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ క్రమంలోనే సబ్జార్ గంజ్ హాస్పిటల్ ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది అన్న విషయాన్ని తెలుసుకొని.. ఇక ఎన్జీవో లో పనిచేస్తున్న మహిళగా ఆ కుటుంబానికి దగ్గర అయింది. కొన్నాళ్లకు ఆమెపై కుటుంబానికి నమ్మకం వచ్చేలా చేసింది. ఇక ఆ తర్వాత ఇక ఆ పసిపిల్లాడిని కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చేందుకు  ప్రయత్నించింది. కానీ వెంటనే అప్రమత్తమైన కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఇక పిల్లాడిని సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. శ్వేతను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: