కలియుగ వైకుంఠం గా ఎంతో మంది భక్తులు పిలుచుకునే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఇక తిరుపతి కూడా ఒకటి అని చెప్పాలి. కాలంతో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ నలమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు అని చెప్పాలి.  సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సంపన్నుల వరకు కూడా అందరూ శ్రీవారి అనుగ్రహం కోసం తరలి వస్తూ ఉంటారు.


 ఇకపోతే కలియుగ వైకుంఠం గా పిలుచుకునే తిరుమల లో ఒక్క సారైనా సరే శ్రీవారిని దర్శించుకోవాలని నిరుపేద ప్రజల సైతం ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల తిరుపతికి వెళుతున్న ఎంతో మంది భక్తులకు అటు దొంగల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అని చెప్పాలి. ఏకంగా భక్తుల ముసుగు వేసుకుంటూ ఎంతో మంది దొంగలు చోరీలకు పాల్పడుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇక తిరుమలలో జరుగుతున్న వరుస చోరీల గురించి అక్కడి అధికారులు స్పందించారు. భక్తులను అప్రమత్తం చేశారు.


 శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులందరూ కూడా దొంగల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు. ఆస్థాన మండపం,  షాపింగ్ కాంప్లెక్స్ లో వరుసగా చోరీలు చోటు చేసుకుంటున్నాయి అని టిటిడి అధికారులు వెల్లడించారు. యాత్రికుల ముసుగు లోనే దొంగలు చోరీలు చేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించాము అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమం లోనే దొంగతనాలకు సంబంధించి కొన్ని దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి అంటూ వెల్లడించారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో అప్రమత్తం గా ఉండాలని సూచించారు టీటీడీ అధికారులు. అపరిచిత వ్యక్తులను అస్సలు నమ్మవద్దు అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd