టెక్నాలజీ పెరిగిపోయింది. పెరిగిపోయిన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎన్నో రకాల మార్పులకు కారణమైంది. ఇక టెక్నాలజీని వాడుకుంటూ ప్రతి పనిని కూడా ఎంతో సులభతరం  చేసుకుంటున్నాడు మనిషి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా నేటి టెక్నాలజీ యుగంలో మనిషిలో ఉన్న విచక్షణ జ్ఞానం పూర్తిగా తగ్గిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. దీనికంతటికీ కారణం ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే. ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి.



 కుదిరితే సహాయం కూడా చేసేవాడు. కానీ ఇప్పుడు ఏకంగా సొంత వారి విషయంలో కూడా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు, ఏకంగా కనిపించిన తల్లిదండ్రుల విషయంలో కాస్తయినా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి. ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా ప్రాణాలను గాల్లో కలీపేస్తున్నాడు మనిషి. ఇలాంటి తరహా ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కూడా ఇలాంటి కోవలోకి చెందిన ఘటనే. సాధారణంగా  తండ్రి కూతుర్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది అని అంటూ ఉంటారు.


 కూతురులో తండ్రి తన అమ్మను చూసుకుంటాడని.. ఇక కూతురు తన తండ్రిని సూపర్ హీరో అనుకుంటుందని అందరు అంటూ ఉంటారు. ఇక తన కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు తండ్రి. ఇక్కడ మాత్రం తండ్రి ఏకంగా కన్నుకూతురుని పొట్టన పెట్టుకొన్నాడు. రాజస్థాన్లోని శిరోహి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 11 తరగతి పరీక్షలకు సరిగ్గా చదవడం లేదనే కారణంతో 17 ఏళ్ల కూతురుని తండ్రి కర్రతో చితకబాదాడు. దెబ్బలు తట్టుకోలేకపోయిన బాలిక చివరికి ప్రాణాలు కోల్పోయింది. బాలిక మామయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: