రానున్న ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు ఎలా ఉన్నా మొన్న‌టి ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్ర రాజ‌కీయాల్లో అనూహ్య రీతిలో ప్ర‌త్యుర్థుల‌ను చిత్తు చేసిన వారికి అందలం మాత్రం అద‌నంగా అంద‌నుంది. త‌న విరోధుల‌పై వీరోచితంగా పోరాడిన వారికి మంత్రి ప‌ద‌వులు ఖాయం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు జ‌గ‌న్. ఇదే స్థాయిలో ప‌నిచేసి విన్నింగ్ స్పిరిట్ చాటాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి కోరిక‌. నెర‌వేరుతుందో లేదో చూడాలిక‌! ఎలానూ బాలయ్య‌పై పోటీ చేసి ఓడిపోయినప్ప‌టికీ మైనార్టీ నేత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. మ‌రి! ఓడిన నేత‌కే ప‌ద‌వి ఇస్తే గెలిచిన‌వారిని నెత్తిన పెట్టుకోవాలి క‌దా! అదీ రాజ‌కీయ విరోధుల‌పై గెలుపు మామూలు గెలుపా?




ఏదేమ‌యినా రాజ‌కీయంలో గెలిస్తే ఓ కిక్. అనూహ్య రీతిలో గెలిస్తే మైలేజీ. ఆ రోజు చింత‌మ‌నేనిపై గెలిచిన అబ్బ‌య్య చౌద‌రి అనే దెందులూరు ఎమ్మెల్యేకు, అటుపై ప‌వ‌న్ పై గెలిచిన భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీ‌నుకు ప‌ద‌వులు వ‌చ్చేస్తాయి అని అంటున్నారు.ఓ విధంగా అబ్బ‌య్య చౌద‌రి ఫుల్ కాన్ఫిడెన్సులో ఉన్నారు. త‌న‌కు ప‌ద‌వి ఇచ్చినా, ఇవ్వ‌కున్నా మ‌ళ్లీ తానే గెలుస్తాన‌ని ధీమాగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధిపై మీరు ఎక్క‌డికి ర‌మ్మ‌న్నా అక్క‌డికి వ‌చ్చి  చ‌ర్చ‌కు సిద్ధం అవుతాన‌ని కూడా స‌వాలు చేస్తున్నారు. ఇదంతా విన్న చింత‌మ‌నేని న‌వ్వి ఊరుకుంటున్నారు త‌ప్ప పెద్ద‌గా స్పందించ‌డం లేదు. మ‌రోవైపు భీమ‌వ‌రం ఎమ్మెల్యేకు కూడా రానున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌దవి ఖాయం అని తెలుస్తోంది. ఈ ఇద్ద‌రూ ఒకే జిల్లాకు చెందిన వారు కావ‌డం విశేషం.



రోడ్లు బాలేవ‌ని అడిగినా, అభివృద్ధి ప‌నులు లేవ‌ని అడిగినా కోపం వ‌చ్చేస్తుంది వైసీపీ నాయ‌కుల‌కు. ఆ కోపం కార‌ణంగానే వాళ్లు జ న సేన నాయ‌కుల‌ను చాలా త‌క్కువ అంచనా వేసి చూస్తున్నారు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తుంది. అంతేకాదు త‌మ‌కు అధికారం ఉంది క‌నుక తిరుగులేదు అన్న భావ‌న త‌రుచూ వినిపిస్తున్నారు. ఒక‌టి కాదు రెండు కాదు రాబోయే ముప్పై ఏళ్లూ మావే అంటు న్నారు. ఈ ద‌శలో ప‌వ‌న్ ను వ్య‌తిరేకించే శ‌క్తిగా భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీ‌నివాస‌రావు పేరు తెచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప వ న్ పై గెలిచి స‌త్తా చాట‌డ‌మే కాకుండా జ‌న సైనికుల‌ను అణిచి వేయ‌డంలోనూ మంచి పేరే తెచ్చుకున్నార‌ని ప‌లువురు మెగా అభి మానులు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో ఆయ‌న‌కు వ‌చ్చే సారి మంత్రి ప‌ద‌వి ఖాయం అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap