సౌదీ అరేబియా, ఇరాన్ రెండు ఇస్లాం దేశాలే అయినప్పటికీ ఆయా దేశాల మధ్య అస్సలు పడేది కాదు. గల్ప్ దేశాలు అన్ని ఒక వైపు ఇరాన్ మరో వైపుగా ఉండేది. రెండు దేశాలు సున్నీ, షియాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకునే వారు. ఈ రెండు దేశాలను దగ్గర చేసింది చైనా. రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని దూరం చేసి ఒక్క తాటిపైకి తీసుకురావడంలో చైనా విజయం సాధించింది. గల్ఫ్ దేశాలు, సౌదీ, ఇరాన్ మధ్య దూరాన్ని పొగొట్టి ఒక్కటిగా మార్చే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.


చైనా సరికొత్త ఆలోచనకు సిద్ధపడుతుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య దౌత్య మార్గం చేయనున్నారని తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ లను కలిసి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.  గతంలోనే భారత ప్రధాని మోదీని సమస్య పరిష్కరించమని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరారు. కానీ రష్యా, ఉక్రెయిన్ ఆకాంక్షలు తెలిసిన మోదీ న్యూట్రల్ గా ఉండిపోయారు. రష్యాకు ఉక్రెయిన్ లో ఉండే రష్యన్ భాష మాట్లాడే వారికి న్యాయం చేయాలి. ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం లక్ష్యం.


అలా గతంలోనే క్రిమియాను స్వాధీనం చేసేసుకుంది. ఇప్పుడు మిగతా ప్రాంతాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది.  ఉక్రెయిన్ చెబుతున్న విషయం గతంలో క్రిమియాను లాక్కుంది. ప్రస్తుతం మా దేశంలో దాడులు చేస్తుంది. దాడులు చేయకుండా ఆపాలి. మా ప్రాంతాల్లో ఉన్న రష్యా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. క్రిమియాను మాకు అప్పగించాలని కోరతారు. ఎలాగో ఈ రెండు అంశాలు సాధ్యమయ్యే పని కాదు. ఇంకా ఉక్రెయిన్ నాటో దేశాలతో చేరడం రష్యాకు అస్సలు ఇష్టం లేదు. మరి జిన్ పింగ్ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపి సయోధ్య కుదిరేలా చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: