ఎరువులు 2.82 బిలియన్ డాలర్లు, రష్యాకు సంబంధించి సీఎంజీ కంపెనీలతో ఒప్పందం చేసుకుని 2022 లో దర్జాగా కొనుక్కున్నారు. రష్యా పై ఆంక్షలు విధించి మీరే మళ్లీ వాళ్ల దగ్గర వీటన్నింటిని గతంలో కంటే ఎక్కువ కొని ఆ డబ్బులను రష్యాకు ఇస్తున్నారని పోలండ్ ప్రధాని ఆరోపించారు. మిగతా యూరప్ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల్ని పాటించడం లేదని ఆరోపిస్తున్నారు.
మీరిచ్చే డబ్బులతోనే మళ్లీ మన దేశాలపై దాడులు చేసేందుకు రష్యా సిద్ధమయినట్లు తెలుస్తోందని పోలండ్ ప్రధాని అన్నారు. వాస్తవంగా ఉక్రెయిన్ తర్వాత పోలండ్ పై రష్యా విరుచుకుపడేందుకు సిద్దంగా ఉందని ఇప్పటికే పోలండ్ ప్రధాని ఆరోపించారు. ఇలాంటి సమయంలో యూరప్ దేశాలు గ్యాస్, ఆయిల్, యూరేనియం, తదితర వాటిపై లావాదేవీలు చేస్తూ రష్యా కు అండగా ఉండటం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇలా తెర వెనక లావాదేవీలు చేయడంపై పోలండ్ మండిపడింది.
రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను కాదని వారితో రహస్యంగా వ్యాపారం చేయడం వల్ల చివరకు నష్టపోయేది పోలండ్, యూరప్ దేశాలేనని అన్నారు. ఇంత జరుగుతున్న యుద్దంలో ఒక పక్క ఆయుధాలు అందజేస్తూ మరో పక్క ఇలా చేస్తుండటం అనేది చాలా దారుణమైన విషయమని పోలండ్ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి