రాజకీయ నాయకులకు ప్రచార యావ ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో ఉండేందుకు కాస్త ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే ఇది నాయకుల పరువు తీస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చరిత్రలో ఎందరో నాయకులు ఈ ప్రచార పిచ్చి పరువు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి అధికారంలో ఉన్నప్పుడు ఆమె పార్టీ ప్రజల్లో ఈ ప్రచార యావతో చులకన అయిపొయింది. ప్రభుత్వ నిధులను ఆమె వాడుకున్న విధానం అప్పట్లో ఆశ్చర్యపరిచింది. పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలను ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసారనే ఆరోపణలు ఉన్నాయి.


ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏపీ సిఎంగా ఉన్న వైఎస్ జగన్.. స్కూల్స్ బ్యాగ్స్, గోడలు, పిల్లల యూనిఫాం, పుస్తకాలు, భూ యాజమాన్య పత్రాలు ఇలా ఎక్కడ దొరికితే అక్కడ తన ఫోటో, పేరు వాడారు. సర్వేల పేరుతో ఆస్తులకు తన పేరు జగన్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇదే బాటలో వెళ్తున్నారు తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రచారాలలో ఉపయోగించే సాధనాలపై తన పేరును ఎక్కువగా వాడారు సిఎం.


దీనిపై తమిళనాడు హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేర్లు, ఫోటో వాడకుండా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు,  వాటి ప్రకటనలలో మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఫోటో, 'ఉంగలుడన్ స్టాలిన్' ('స్టాలిన్ విత్ యు') అనే పేరును ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు పెట్టడం సుప్రీంకోర్టు తీర్పులను,  ప్రభుత్వ ప్రకటన (కంటెంట్ నియంత్రణ) మార్గదర్శకాలు 2014ను ఉల్లంఘించడమేనని పిటిషనర్ కోర్ట్ లో వాదనలు వినిపించారు.


ముఖ్యమంత్రి పేరు ఉపయోగించిన 'ఉంగలుదన్ స్టాలిన్' 'నలం కాకమ్ స్టాలిన్ తిట్టం' వంటి పథకాలను ఉటంకిస్తూ, అటువంటి బ్రాండింగ్ ప్రజా ఖజానాకు నష్టం కలిగిస్తూ అనవసరమైన రాజకీయ మైలేజీని తీసుకొస్తుందని వాదించారు. దీనితో ఆ పేర్లు వాడకుండా ఆదేశాలు ఇచ్చింది హైకోర్ట్. ఇక దీనిపై తమిళ ప్రజల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే తమిళ ప్రజలు.. ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. అవినీతి రొచ్చులో కూరుకుపోయిన ప్రభుత్వం ఈ చేష్టలతో ప్రజల్లో మరింత చులకన అవుతోందని, చేసిన అవినీతి కార్యక్రమాలలో కూడా సిఎం ఫోటో వాడితే బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: